E-Paper
Advertisement

Indian Navy Recruitment: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు, పూర్తి వివరాలివే

Indian Navy Recruitment: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు, పూర్తి వివరాలివే

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ శుభవార్త.. భారత నౌకాదళంలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. భారత నౌకాదళం అగ్నివీర్ 01/2027, 02/2027 బ్యాచ్‌ల ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశ రక్షణ రంగంలో స్థిరపడాలనుకునే అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు 2026 మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ అప్లికేషన్లను సమర్పించవచ్చు.

విద్యార్హత: 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2)లో గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో మూడు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. వీటితో పాటు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులుగా రెండేళ్ల వొకేషనల్ కోర్సు చేసిన వారికి సైతం అవకాశం కల్పించారు.

వయస్సు: 

వయోపరిమితిని పరిశీలిస్తే 01/2027 బ్యాచ్ అభ్యర్థులు 2004 డిసెంబర్ 01 నుంచి 2009 మే 31 మధ్య జన్మించి ఉండాలి. 02/2027 బ్యాచ్ అభ్యర్థులు 2005 మే 1 నుంచి 2009 అక్టోబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. కేవలం అవివాహిత అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు పోటీ పడాలి. ఎంపికైన వారు శిక్షణ కాలంతో పాటు నాలుగు సంవత్సరాల సేవా కాలంలో వివాహం చేసుకోకూడదనే నిబంధన ఉంది.

జీతం: 

ఎంపికైన అగ్నివీర్‌లకు ఆకర్షణీయమైన జీతాలు ఉంటాయి. నెలకు రూ.30,000 వేతనంతో పాటు ప్రతి ఏటా ఇంక్రిమెంట్ ఉంటుంది. నాలుగు సంవత్సరాల సేవ పూర్తయ్యాక వడ్డీతో కలిపి సుమారు రూ.10.04 లక్షల సేవా నిధి ప్యాకేజీని ప్రభుత్వం అందిస్తుంది. అదనంగా రూ.48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ సైతం లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ: 

ఎంపిక ప్రక్రియ రెండు కఠినమైన దశల్లో కొనసాగుతుంది. మొదటి దశలో 2026 మే నెలలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (INET) నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. మొదటి దశలో ప్రతిభ కనబరిచిన వారికి రెండో దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT), రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు ఫీజుగా రూ.550తో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాల కోసం భారత నౌకాదళ అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది.

నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేసి ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అఫీషియల్ వెబ్ సైట్: www.joinindiannavy.gov.in

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×