BigTV English
Advertisement

RCB vs SRH : బెంగళూరుకు షాక్.. వెంటాడుతున్న వరుణుడు.. వేదిక లో మార్పు

RCB vs SRH : బెంగళూరుకు షాక్.. వెంటాడుతున్న వరుణుడు.. వేదిక లో మార్పు

RCB vs SRH : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి షాక్ తగిలిందనే చెప్పాలి. ఇప్పటికే ఈ సీజన్ లో ఇప్పటివరకు ఈ జట్టు 12 మ్యాచ్ లు ఆడితే 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్ ల్లో మాత్రం ఓటమిపాలైంది. 1 మ్యాచ్ వర్షం కారణంగా మొన్న రద్దు అయింది. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ జట్టు ప్లే ఆప్స్ కి చేరుకుంది. ఈ నేపథ్యంలోో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు జట్టు మధ్య జరగాల్సిన మ్యాచ్ ని లక్నో కి మార్చారు. వాస్తవానికి బెంగళూరులో భారీ వర్షాలు పడనున్నట్టు సమాచారం.


Also Read : Sanjiv Goenka : 27 కోట్లు బొక్క… చేసేదేమీ లేక పంత్ కు మసాజ్ చేస్తున్న లక్నో ఓనర్

మ్యాచ్ కి వర్షం ముప్పు.. 


దీంతో మ్యాచ్ కి వర్షం ముప్పు ఉండటంతో మే 23న ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ లక్నో లో జరుగనుంది.  ఇక హైదరాబాద్ తో మ్యాచ్ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మే 27న లక్నో వేదికగానే లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది.  ఈ తరుణంలో సన్ రైజర్స్ తో మ్యాచ్ ని కూడా అక్కడికి తరలించారు. దీంతో బెంగళూరు అభిమానులకు కాస్త నిరాశ అనే చెప్పాలి. బెంగళూరు లో చూడాల్సిన మ్యాచ్ లు వర్షం కారణంగా పక్కదారి పట్టడంతో అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో అండర్ డ్రైనేజీ దేశంలోనే అద్భుతంగా ఉండటంతో అక్కడ మ్యాచ్ నిర్వహించకుండా మరో స్టేడియానికి తరలించడం ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు ఆర్సీబీ అభిమానులు. మరోవైపు ఈ సీజన్ లో ఆర్సీబీ కప్ కొట్టడం ఖాయం అని పేర్కొంటున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలోనే ఆర్సీబీకి కప్ రావాల్సింది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కప్ సాధించింది. దీంతో మూడు సార్లు ఫైనల్ కి వెళ్లిన ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ సాధించకపోవడం గమనార్హం.

ప్లే ఆప్స్ కి మ్యాచ్ ల వేదికలు ఖరారు 

ఐపీఎల్ 2025 సీజన్ ఇటీవల వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే పున: ప్రారంభించి షెడ్యూల్ ని తయారు చేశారు. కానీ ప్లే ఆప్స్ సంబంధించిన వేదికలను అప్పుడు ఖరారు చేయలేదు. తాజాగా ప్లే ఆప్స్ కి సంబంధించిన వేదికలు ఖరారు అయ్యాయి. ఈ సీజన్ కి సంబంధించిన ప్లే ఆప్స్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. ముల్లాన్ పూర్, అహ్మదాబాద్ లో నాలుగు ప్లే ఆప్స్ మ్యాచ్ లు జరుగనున్నాయి. మే 29న జరిగే క్వాలిఫయర్ 1, మే 30 న జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ లకు ముల్లాన్ పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక జూన్ 01న జరిగే క్వాలిఫయిర్ 2, జూన్ 03న జరిగే ఫైనల్ మ్యాచ్ లు మాత్రం అహ్మదాబాద్ లో జరుగనున్నాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆప్స్ కి చేరుకున్నాయి. ప్లే ఆప్స్ కి చేరుకునేందుకు నాలుగో జట్టుగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడుతున్నాయి. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ల్లో ఈ రెండు జట్లలో ఏది విజయం సాధించి ప్లే ఆప్స్ కి చేరుకుంటాయో వేచి చూడాలి.

Related News

Jemimah Rodrigues: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జెమిమా బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెంపు.. ఎన్ని కోట్లు అంటే

Ind vs Sa: కాపు – చౌదరి మధ్య చిచ్చు పెట్టిన దక్షిణాఫ్రికా లేడీ బౌలర్!

World Cup 2025: RCB చేసిన పాపం.. టీమిండియా మ‌హిళ‌ల‌కు త‌గులుతుందా, సెల‌బ్రేష‌న్స్ లేకుండానే ?

Virat Kohli: 6 గురు అమ్మాయిల‌తో విరాట్ కోహ్లీ ఎ**ఫైర్లు..లిస్ట్ రోహిత్ శ‌ర్మ భార్య కూడా ?

Sara -Shubman Gill: బ‌ట్ట‌లు విప్పి చూపించిన గిల్‌…బిల్డ‌ప్ కొట్ట‌కు అంటూ సారా సీరియ‌స్!

Hardik Pandya: ప్రియురాలి కారు కడుగుతున్న హార్దిక్ పాండ్యా…ముద్దులు పెడుతూ మ‌రీ !

Haris Rauf: హారిస్ రవూఫ్ పై ICC బ్యాన్..సూర్య‌కు కూడా షాక్‌

RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

Big Stories

×