Bank Jobs: డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్, ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్(AP MAHESH CO-OPERATIVE URBAN BANK LTD) ఖాళీగా ఉన్న క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 14 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 50
ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ లో క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చూస్తారు.
పోస్టులు – ఖాళీలు:
క్లర్క్ కమ్ క్యాషియర్: 50 పోస్టులు
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 15
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 14
వయస్సు: 2025 ఫిబ్రవరి 28వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు 1997 ఫిబ్రవరి 28 కి ముందు, 2005 ఫిబ్రవరి 2 తర్వాత జన్మించి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవా్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
* ఎగ్జామ్ 160 మార్కులకు నిర్వహిస్తారు. రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 2 గంటల సమయం ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇది 40 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల సమయం ఉంటుంది.
ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, వరంగల్, విజయవాడ
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://apmaheshbank.com/
ALSO READ: ARMY PUBLIC SCHOOL: డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.52,500 జీతం.. ఇంకెందుకు ఆలస్యం
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 50
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 14