BigTV English

Vizianagaram Siraj Case: సూసైడ్ బాంబర్లు.. హైదరాబాద్‌లో ఎంతమంది ఉన్నారంటే..? విచారణలో విస్తుపోయే నిజాలు

Vizianagaram Siraj Case: సూసైడ్ బాంబర్లు.. హైదరాబాద్‌లో ఎంతమంది ఉన్నారంటే..? విచారణలో విస్తుపోయే నిజాలు

Vizianagaram Siraj Case: హైదరాబాద్‌లో కూడా సిరాజ్ ఉగ్ర కదిలికలపై విచారణ కొనసాగుతోంది. గ్రూప్స్ పరీక్షల శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చిన సిరాజ్.. ఏడేళ్లుగా హైదరాబాద్‌లోనే మకాం వేశాడు. ఈ సమయంలో ఏం చేశాడు? ఎలా చేశాడు? అనే దానిపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటి వరకు సమీర్‌తో కలిసి 5 ప్రాంతాల్లో రెక్కీ చేశాడు సిరాజ్. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ బెంగళూరు, ముంబైలలో సిరాజ్, సమీర్‌ ఇద్దరు కలిసి రెక్కీ నిర్వహించారు.


మరోవైపు సిరాజ్‌నిత్యం టచ్‌లో ఉన్న వరంగల్‌కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్‌తో టచ్‌లో ఉన్నాడు సిరాజ్. ఇప్పుడు వీరిని కూడా పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అంతేకాదు ఈ గ్రూప్ అంతా దేశ, విదేశాల్లో ఉగ్రవాద అనుకూల స్వభావమున్న యువకులతో సంబంధాలు నెరిపారని గుర్తించారు. ఇక సిరాజ్‌ స్థాపించిన సంస్థ సభ్యులను గుర్తించే ప్రయత్నం కూడా జరుగుతోంది. అసలు సిరాజ్‌, సమీర్‌ల ప్లాన్ ఏంటనే దానిపై NIA ఫోకస్ చేసింది.

మ్యాజిక్ లాంథర్ కాన్సెప్ట్ ఆధారంగా అహిం సంస్థ పని చేస్తోందని తేల్చారు. మతోన్మాద భావాలున్న యువతను లక్ష్యంగా చేసుకుని సంస్థ పని చేస్తోందని నిందితుల నుంచి రాబట్టారు. సోషల్ మీడియాలో మత విద్వేష పోస్టులు పెట్టినవారిని గుర్తించి ఈ సంస్థలో చేర్చుకుంటున్నారు. భారతదేశం అంతటా అహిం సంస్థను విస్తరించడమే సౌదీ అరేబియా, ఒమన్ హ్యాండ్లర్‌ల లక్ష్యం. ఇప్పటికే ఏపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు మరో రాష్ట్రంలో అహిం గ్రూపును ఏర్పాటు చేశారని విచారణల సిరాజ్ నుంచి రాబట్టాలరు అధికారులు. విజయనగరంలో పేలుళ్లు సక్సెస్ ఐతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పేలుళ్లు జరపడానికి నిర్ణయించారు. ఓ రకంగా చెప్పాలంటే విజయనగరం పేలుళ్లును రిహార్సల్స్ లా భావించారు.


నిందితులు సిరాజ్, సమీర్‌లను ప్రశ్నిస్తున్నారు. ATS, NIA, ఇంటలిజెన్స్‌ అధికారులు. నిన్న ఇద్దరికీ ఒకే తరహా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఉగ్రవాద సంబంధాలు, పేలుడు పదార్థాల కొనుగోలు, ఆర్థిక వనరులు సమకూర్చిన వారి పేర్లు అడిగారు. పేలుళ్ల కుట్రను ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అమలు చేసేందుకు ప్లాన్ చేశారని ఇద్దరినీ ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు సిరాజ్‌ ముక్తసరిగా సమాధానాలు చెప్పారని సమాచారం.

ఎంక్వైరీలో స్పీడ్ పెంచిన పోలీసులు.. సిరాజ్ అద్దెకి ఉంటున్న ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలోని బాబమెట్ట ఏరియాలో డబుల్ కాలనీలో సిరాజ్ రూమ్ రెంట్ కు తీసుకుని ఉంటున్నాడు. రాత్రి సమయాల్లో కొండ ప్రాంతంలో ఒంటరిగా తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. అప్పుడప్పుడు పాన్ షాప్‌లలో గుట్కా కొనేవాడని అంటున్నారు.

Also Read: ఖాళీ ప్లాట్లలో కాల్ సెంటర్స్.. కట్ చేస్తే రూ.50 కోట్ల స్కామ్, విశాఖలో వింత దందా!

అటు సిరాజ్ తండ్రి రెహ్మాన్‌పై కూడా NIA ఫోకస్‌ చేసింది. రెహ్మాన్‌ రెండు సార్లు బ్యాంక్ లాకర్ తెరవడానికి ఎందుకు ప్రయత్నించాడన్న కారణాలపై ఆరా తీసింది NIA. రెహ్మాన్ పలుమార్లు బ్యాంకుకు వెళ్లడంతో మఫ్టీలో ఓ అధికారిని కూడా బ్యాంక్ వద్ద ఉంచింది NIA. మరోవైపు పేలుడు పదార్థాల కేసులో కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంతంలో ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురూ క్వారీ బ్లాస్టులకు సంబంధించి అనధికారికంగా పేలుడు పదార్థాలు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. వీరి దగ్గరే సిరాజ్ కొన్ని పేలుడు పదార్థాలు కొన్నట్టుగా అనుమానిస్తున్నారు.

అటు సిరాజ్ సమీర్ లకు వారం రోజుల కస్టడీ ఇచ్చింది కోర్టు. నిందితులకు కస్టడీ టైంలో థర్డ్ డిగ్రీ ఇవ్వొద్దన్నది కోర్టు. విజయనగరం టూటౌన్ పోలీసులు అరెస్టు చేసిన ఈ ఇద్దరు నిందితులు ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×