ఒకప్పుడు పెళ్లిళ్లు సంప్రదాయ బద్దంగా జరిగేవి. పురోహితుల వేదమంత్రాలు, బంధుమిత్రుల ఆశీర్వాదాల నడుమ పెళ్లి కొడుకుడు, పెళ్లి కూతురు సంసార జీవితంలోకి అడుగు పెట్టేవారు. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. నలుగురికి భిన్నంగా పెళ్లి చేయాలనుకునే పద్దతి పెరిగిపోయింది. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ లో జరిగిన ఓ పెళ్లి వేడుక టాక్ ఆఫ్ ఇది వరల్డ్ గా మారిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
వధువు ఇంటి మీద విమానంతో డబ్బులు కురిపించిన వరుడి తండ్రి
రీసెంట్ గా పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్ లో ఓ వివాహం జరిగింది. అబ్బాయి తండ్రి కోటీశ్వరుడు. అమ్మాయి ఫ్యామిలీ కాస్త తక్కువ డబ్బున్న ఫ్యామిలీ. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ పెళ్లికి అబ్బాయి ఫ్యామిలీ అంగీకరించింది. మొత్తంగా పెద్దలు ఒకప్పుకున్న ప్రేమ వివాహం జరిగింది. ఇక తన కొడుకు పెళ్లి గురించి జనాలు ప్రత్యేకంగా చర్చించుకోవాలి అనుకున్నాడు వరుడి తండ్రి. అనుకున్నదే ఆలస్యంగా ఓ చిన్న జెట్ విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. వివాహం జరిగే సమయంలో ఆ ఫ్లైట్ నుంచి ఏకంగా వధువు ఇంటి మీద డబ్బుల వర్షం కురిపించాడు. లక్షల రూపాయలను గాల్లోకి విసిరేశారు. ఈ ఘటన చూసి పెళ్లికి వచ్చిన వారితో పాటు చుట్టు పక్కల గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “వరుడి తండ్రి వధువు ఇంటి మీద నోట్ల వర్షం కురిపించాడు. లక్షలాది రూపాయలను గాల్లోకి విసిరేశారు. ఈ పెళ్లిని పాకిస్తాన్ వాసులు ఎప్పటికీ మార్చిపోలేరు” అంటూ 𝔸𝕞𝕒𝕝𝕢𝕒 అనే పాకిస్తానీ సోషల్ వర్కర్ ఎక్స్ లో ఈ వీడియోను షేర్ చేశారు.
دلہن کے ابو کی فرماٸش۔۔۔😛
دولہے کے باپ نے بیٹے کی شادی پر کراٸے کا جہاز لےکر دلہن کے گھر کے اوپر سے کروڑوں روپے نچھاور کر دیٸےاب لگتا ہے دُولھا ساری زندگی باپ کا قرضہ ہی اتارتا رہیگا pic.twitter.com/9PqKUNhv6F
— 𝔸𝕞𝕒𝕝𝕢𝕒 (@amalqa_) December 24, 2024
Read Also: 4 గంటల్లో 15 లీటర్ల మద్యం ఖాళీ, మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా అయ్యా!
సోషల్ మీడియాలో ట్రెండింగ్..
ఇక ఈ డబ్బుల వర్షం కురిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డబ్బులు అంతగా ఎక్కువ ఉంటే పేదలకు పంచి పెట్టవచ్చు కదా? అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొంత మంది డబ్బును ఇలా దుబారా చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “డబ్బును అలా ఆకాశం నుంచి కిందికి వెదజల్లే బదులు, నిరు పేదలకు సాయం చేస్తే ఎంతో బాగుండేది” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “డబ్బును ఇలా వేస్ట్ చేయడం వల్ల కలిగిన లాభం ఏంటో అర్థం కావట్లేదు” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “వీళ్ల పెళ్లి వల్ల కనీసం ఆ ఊరి వాళ్లకైనా కాసిన్ని డబ్బులు దొరికాయి. వాళ్లు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఈ వీడియోపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తే, మరికొంత మంది నెగెటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈ పెళ్లి వ్యవహారం ప్రస్తుతం పాక్తిస్తాన్ లో హాట్ టాపిక్ గా మారింది.
Read Also: పెళ్లి మండపంలో పురోహితుడికి కోపం.. దెబ్బకు గాల్లో ఎగిరి.. వీడియో వైరల్!