EPFO Notification: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా…? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..? డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్స్ కు అయితే ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులు, విద్యార్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఉద్యోగం ఎంపిక విధానం, జీతం, తదితరి ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో(ఈపీఎఫ్‌వో) ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ (EO /AO /APFC) లాంటి 230 పోస్టుల భర్తీ చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 29 నుంచి ఆగస్టు 18 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 230
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెండ్ ఫండ్ కమిషనర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీల వివరాలు..
ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/ అకౌంట్ ఆఫీసర్: 156 పోస్టులు (యూఆర్-78; ఈడబ్ల్యూఎస్-01; ఓబీసీ-42; ఎస్సీ-23; ఎస్టీ-12; పీడబ్ల్యూబీడీ-09)
అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్: 74 పోస్టులు (యూఆర్-32; ఈడబ్ల్యూఎస్-07; ఓబీసీ-28; ఎస్సీ-07; పీడబ్ల్యూబీడీ-03)
విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. కంపెనీ లా/లేబర్ లా/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఉండును.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 29
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్ట్ 18
వయస్సు: ఉద్యోగాన్ని అనుసరించి వయస్సును నిర్దారించారు. ఎన్ఫోర్స్‌మెంట్/ అకౌంట్ ఆఫీసర్‌కు 30 ఏళ్లు; అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌కు 35 ఏళ్లు వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CRT), ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: అఫీషియల్ వెబ్ సైట్ https://upsconline.nic.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఒక పోస్టుకు రూ.25, రెండు పోస్టులకు రూ.50 ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎగ్జామ్ సెంటర్స్: దేశ వ్యాప్తంగా 78 ముఖ్య నగరాల్లో ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీలో అయితే హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం నగరాల్లో ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://upsconline.nic.in
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 230
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 18
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. దరఖాస్తు చేయండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..