SSMB 29..దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తొలిసారి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘SSMB 29’. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే హైదరాబాదులో ఇండోర్ షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ఒరిస్సాలో అవుట్డోర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నట్లు గ్లోబల్ ఐకాన్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా తెలియజేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈసారి హోలీ వేడుకను చిత్ర బృందంతోనే జరుపుకున్నాను అంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటూ ఈ సినిమా షూటింగ్ అప్డేట్ కూడా ఇచ్చేసింది ప్రియాంక.
వచ్చే ఏడాదే ఎస్ఎస్ఎంబి – 29 రిలీజ్..
ఇక ప్రియాంక చోప్రా లీడ్ రోల్ పోషిస్తూ.. మహేష్ బాబు హీరోగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ గా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం అభిమానులు కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉండగా.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై ఒక వార్త అందరిలో ఆనందాన్ని కలిగిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి సినిమాలు అంటేనే మినిమం రెండేళ్లు అన్నట్టు అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇదివరకే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి(Bahubali ), బాహుబలి 2 (Bahubali 2) తో పాటు ఆర్ఆర్ఆర్(RRR ) సినిమాల కోసం దాదాపు రెండేళ్లకు పైగానే రాజమౌళి సమయం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమాల స్ఫూర్తితోనే వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
ఆ చిత్రాల స్ఫూర్తితోనే వేగంగా షూటింగ్..
అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి తొలి పాన్ ఇండియా చిత్రంగా ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కించారు. అందులోనూ మొదటి సినిమా పాన్ ఇండియా చిత్రం కావడంతో.. పనులేవీ అనుకున్న విధంగా జరగలేదు. మధ్యలో అదే సినిమాను రెండు భాగాలుగా చేయడంతో రిలీజ్ విషయంలో కూడా కాస్త ఆలస్యం అయ్యింది. ఇక తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల అనుభవం నుంచి రాజమౌళి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని చక్కగా నేర్చుకున్నారట. అందులో భాగంగానే ఆయన దర్శకత్వం వహిస్తున్న మూడవ పాన్ ఇండియా చిత్రం ఎస్.ఎస్.ఎమ్.బి – 29 కావడంతో ఈ సినిమా కోసం కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే కేటాయించాలని అందులో భాగంగానే ఏడాదిన్నరలోపే సినిమాలో రిలీజ్ చేయాలని పగడ్బందీగా ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం.
ALSO READ:VC Sajjanar: యూట్యూబర్ హర్షసాయిపై కేస్ ఫైల్.. వదిలిపెట్టేది లేదంటున్న సజ్జనార్..!
పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్న రాజమౌళి..
ఇక అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయిన వెంటనే రాజమౌళి, మహేష్ బాబు సినిమా పాటలు మొదలు పెట్టారని, ఇప్పటివరకు తాను అనుకున్నట్లు అంతా సవ్యంగానే పక్కా ప్రణాళికతోనే జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఇదే ప్రణాళికతో షూటింగ్ మొత్తం ఏడాదిలోపే పూర్తి చేయడం, ఆ తర్వాత మరో నాలుగు నెలలు సీజీ వర్క్ పూర్తి చేయగలిగితే కచ్చితంగా.. 2026 సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ఆయన సన్నిహిత వర్గాలు కూడా ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలు ఇచ్చిన సమయస్ఫూర్తితో రాజమౌళి ఈ సినిమాను పక్కాగా ప్లాన్ చేసుకొని, ఎంత వేగంగా విడుదల చేస్తారో చూడాలి.