E-Paper
Advertisement

Rudraksha: నిద్రించే సమయంలో రుద్రాక్షలు ధరించవచ్చా..? అసలు నిజం అదేనట

Rudraksha: నిద్రించే సమయంలో రుద్రాక్షలు ధరించవచ్చా..? అసలు నిజం అదేనట
Advertisement

Rudraksha: నిద్రించే సమయంలో రుద్రాక్షలు ధరించవచ్చా..? రుద్రాక్షలు ధరిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి. అనే అనుమానాలు చాలా మందికి వస్తుంటాయి. అయితే నిద్రించే సమయంలో రుద్రాక్షలు అసలు ధరించకూడదని పండితులు సూచిస్తున్నారు. ఎందుకు ధరించకూడదో.. ధరిస్తే జరిగే పరిణామాలేంటో  ఈ కథనంలో తెలుసుకుందాం.

మహాశివుడి కన్నీళ్లనుంచి రుద్రాక్ష ఆవిర్భవించిందని అంటారు. అందుకే జీవితంలోని అనేక సమస్యలను తొలగించే శక్తి రుద్రాక్షలకు ఉందని నమ్ముతారు. చాలా మందికి రుద్రాక్ష ధారణ గురించి అనేక సందేహాలున్నాయి. వాటిలో, నిద్రించేటప్పుడు రుద్రాక్షను తీసివేయాలా? లేదా రుద్రాక్షను ధరించే నిద్రించవచ్చా? అనేది ముఖ్యమైనది. అయితే నింద్రించే ముందు రుద్రాక్షను తీసివేయడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు.

రుద్రాక్షను నిద్రించేటప్పుడు ఎందుకు ధరించకూడదు?:

Advertisement

రుద్రాక్ష ధారణ చేసిన వ్యక్తి పవిత్రంగా ఉండాలి. పగటి వేళలో, మీరు చేయబోయే పనులపై మీకు అవగాహనతో పాటు నియంత్రణ కూడా ఉంటుంది. ఏదైనా చెడు కర్మ చేయబోయినా మిమ్మల్ని ఆ పని చేయకుండా నియంత్రించుకోగల సామర్థ్యం  పగటి వేళలో మీకుంటుంది. కానీ, నిద్రిస్తున్నప్పుడు అపస్మారకంగా ఉన్న మనసు మీద మీకు నియంత్రణ ఉండదు. పగటి వేళలో అణచివేతకు గురిచేయబడిన ఆలోచనలు నిద్రించే సమయంలో మిమ్మల్ని కలల రూపంలో పలకరిస్తాయి. అలా పగటివేళలో అణచివేతకు గురైన పగ, మొహం, అసూయ, దురాశ వంటి చెడు భావోద్వేగాలు మీ కలలో దర్శనమివ్వచ్చు. ఇవన్నీ మీరు ధరించిన రుద్రాక్ష యొక్క శక్తిని నశింపచేసి అపవిత్రం చేస్తాయి. రుద్రాక్షను ధరించి మీరు నిద్రించినప్పుడు, శృంగారానికి సంబంధించిన కలలు మీకొచ్చినట్లయితే మీరు ధరించిన రుద్రాక్ష అపవిత్రమైనట్లేనని మీరు భావించాలి. కాబట్టి నిద్రించే సమయంలో రుద్రాక్షను మీరు మీ ఇంటి పూజమందిరంలో భద్రపరిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.

నిద్రించే సమయంలోనే కాదు:

రుద్రాక్షను మీరు నిద్రించే సమయంలోనే కాదు..  ఎవరివైనా అంత్యక్రియలకి స్మశానానికి వెళ్తున్నప్పుడు రుద్రాక్షను ఇంట్లో వదిలి వెళ్ళాలి. ఇంటికి రాగానే, తలస్నానం చేయాలి. తల భాగంలో అలాగే ఉదరం కింద భాగంలో మానవుని తేజస్సు అమితంగా ఉంటుంది. అందుకే స్నానపు నీటిలో ఉప్పు వేసి  ఆ నీటితో స్నానం చేయాలి. తర్వాత రుద్రాక్ష ధారణ చేయడానికి ముందు మంత్ర జపం చేయాలి.

రుద్రాక్షను ధరించాక మద్యం, మాంసం స్వీకరించకూడదు:

Advertisement

రుద్రాక్ష ధరించాక మాంసాహారానికి అలాగే మద్యపానానికి దూరంగా ఉండాలి. ఒకవేళ మీరు దూరంగా ఉండలేకపోతే కనీసం ఆ ఒక్క రోజుకు రుద్రాక్షను తీసివేసి పూజా మందిరంలో పెట్టాలి. ఆ మరునాడు, స్నానం చేసి మంత్రం జపం చేసి రుద్రాక్షను పవిత్రంగా ధరించాలి.

కఠిన బ్రహ్మచర్యం పాటించాలి:

రుద్రాక్షను  ధరించిన వారు కఠిన బ్రహ్మచర్యం పాటించాలని పండితులు సూచిస్తున్నారు. వారు మాత్రమే నిద్రించే సమయంలో కూడా రుద్రాక్ష ధారణకు అర్హులు.  ఒక వేళ మీరు మంత్రం జపం చేస్తూ ఆధ్యాత్మిక ఆలోచనలతో దైవ నామస్మరణకే ప్రాధాన్యం ఇచ్చే వారైతే, మీరు మీ ఆలోచనల పట్ల అలాగే చేతలపట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. సానుకూలంగానే ఆలోచించాలి. ఎవరినీ తిట్టకూడదు. ఎవరినైనా, మానసికంగాగాని, శారీరకంగా గాని అలాగే మాటలతోగాని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే, ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వారిలో ఆలోచనల ప్రభావం సాధారణ వ్యక్తి ఆలోచనల ప్రభావం కంటే చాలా శక్తివంతమైనది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: నరసింహ్మస్వామితో పరమశివుడు ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా..?- ఆ యుద్ధంలో ఎవరు గెలిచారంటే..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×