BigTV English
Advertisement

Skills University: తెలంగాణ యువతకు గోల్డెన్ ఛాన్స్.. స్కిల్ వర్సిటీలో కొత్తగా 3 కోర్సులకు నోటిఫికేషన్.. కోర్సు అయ్యాక..?

Skills University: తెలంగాణ యువతకు గోల్డెన్ ఛాన్స్.. స్కిల్ వర్సిటీలో కొత్తగా 3 కోర్సులకు నోటిఫికేషన్.. కోర్సు అయ్యాక..?

Skills University: తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. వర్సిటిలో మరో 3 కోర్సులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రైవేటు రంగంలో తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ప్రారంభించింది.


రాష్ర్టంలో అభివృద్థి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ రూపొందించింది. ప్రాధాన్య రంగాల్లో ఫార్మా, కన్‌స్ట్రక్షన్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఈ కామర్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌, రిటైల్‌, యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌ అండ్‌ కామిక్స్‌ తదితరాలున్నాయి. సంబంధిత రంగంలో పేరొందిన కంపెనీల భాగస్వామ్యంతో కోర్సులను రూపొందించి యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు.. అదే కంపెనీలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు.

తాజాగా ‘యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ’ కిమ్స్, ఏఐజీ ఆసుపత్రులు, టీ – వర్క్స్ భాగస్వామ్యంతో 3 కోర్సులకు నోటిఫికేషన్లను జారీ చేసింది. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోర్సులకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు నిరుద్యోగులు తరచూ ‘www.yisu.in’ వెబ్ సైట్ లో చూడాలని యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు.


మూడు కోర్సులు:

1. ఏఐజీ హాస్పిటల్స్ ఎండోస్కోపీ టెక్నీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రాం

2. టీ వర్క్స్ ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రాం

3. మెడికల్ కోడింగ్ అండ్ స్కిల్స్ ప్రోగ్రామ్

1. ఏఐజీ హాస్పిటల్స్ ఎండోస్కోపీ టెక్నీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రాం..

వ్యవధి: 6 నెలలు

అర్హులు: ఇంటర్(బైపీసీ)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత

వయసు: 25 ఏళ్లలోపు

శిక్షణ: ఎండోస్కోపీ ఆపరేషన్స్ పై క్లాస్ రూం, ప్రాక్టికల్ ట్రైనింగ్

ఉపాధి అవకాశాలు: ఏఐజీ, ఇతర ఆసుపత్రుల్లో ప్లేస్ మెంట్

ఫీజ: రూ.10వేలు ఉంటుంది.

2. టీ వర్క్స్ ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రాం

వ్యవధి: 2 నెలలు

అర్హత: పదో తరగతి పాసై ఉండాలి.

వయసు: 18- 25 ఏళ్లలోపు

శిక్షణ: డిజైన్ థింకింగ్, క్యాడ్/క్యామ్ పై అవగాహన కల్పించడం, 3డీ ప్రింటింగ్, వెల్డింగ్, సీఎన్సీ మెషినింగ్, అడ్వాన్స్ డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, ప్యాకేజింగ్, వుడ్ , లేజర్ కటింగ్ తదితర అంశాలపై శిక్షణ

ఉపాధి అవకాశాలు: జూనియర్ ప్రోటో టైపింగ్ టెక్నీషిన్ గా అవకాశం(జీతం రూ.15వేల నుంచి రూ.25వేల వరకు)

ఫీజు: రూ.3వేలు ఉంటుంది.

Also Read: Cochin Shipyard: ఈ జాబ్ వస్తే.. రూ.2,20,000.. వీళ్లందరూ కూడా అర్హులే.. మీరున్నారా..?

3. మెడికల్ కోడింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రాం

వ్యవధి: 55 రోజులు(45 రోజులు – మెడికల్ కోడింగ్, 10 రోజులు- సాఫ్ట్ స్కిల్స్ పై శిక్షణ)

అర్హులు: బీఎస్సీ(లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత

వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

శిక్షణ: మాస్టర్ మెడికల్ టెర్మినాలజీ, కోడింగ్ సిస్టమ్స్ పై శిక్షణ

ఉపాధి అవకాశాలు: మెడికల్ కోడింగ్ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ మెడికల్ కోడర్

ఫీజు: రూ.18వేలు ఉంటుంది.

Related News

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

SEBI JOBS: సెబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1,26,100 జీతం, దరఖాస్తు ప్రక్రియ షురూ

BEL Notification: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. బీటెక్ పాసైతే చాలు, జీతం అక్షరాల రూ.1,40,000

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. జిందగీలో ఇలాంటి జాబ్ కొట్టాలి భయ్యా.. లైఫ్ అంతా సెట్

Big Stories

×