Sookshmadarshini OTT : నజ్రియా నజీమ్ (Nazriya Nazim), బాసిల్ జోసెఫ్ (Basil Joseph) ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టరీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సూక్ష్మదర్శిని (Sookshmadarshini). MC జితీన్ దర్శకత్వంలో నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. కేవలం రూ.5 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఇపుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఖరారైపోయింది. రేపే డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది.
సూక్ష్మదర్శిని మూవీ ఓటీటీ ఎంట్రీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ సీన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే థియేటర్ లో ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటంతో ఓటీపీ ఎంట్రీ కోసం ఎదురుచూశారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను డిస్నీ+ హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. రేపటినుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
సూక్ష్మదర్శిని మూవీలో నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్ అద్భుతంగా నటించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మలయాళ సినిమాకి నజ్రియా నజీమ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా కథ సైతం ఆకట్టుకునేాలా ఉంది. ఇందులో ప్రియదర్శిని (నజ్రియా నజీమ్) హౌజ్ వైఫ్. భర్త, కూతురుతో కలిసి హ్యాపీగా లైఫ్ ను గడిపేస్తుంది. అయితే ఇరుగుపొరుగువారి విషయాల్లో ప్రియకు చాలా ఆసక్తి ఉండటంతో.. తన చుట్టుపక్కల జరిగే ప్రతీ విషయంపైనా ఫోకస్ పెడుతుంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఇళ్లల్లో ఏం జరుగుతుందో ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. వారి జీవితాలు, స్థానిక సంఘటనలతో పాటు మరిన్ని విషయాలపై ఫోకస్ పెంచుకుంటుంది.
అంతేకాకుండా ఈ విషయాలు స్థానిక మహిళలతో వాట్సాప్ లో అప్డేట్ కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రియా పక్కింట్లోకి కొత్తగా వచ్చిన మాన్యుయేల్ (బాసిల్ జోసెఫ్) వింత ప్రవర్తన ప్రియలో ఎన్నో అనుమానాల్ని రేకెత్తిస్తుంది. ఇంతలో మాన్యుయెల్ తల్లి అల్జీమర్స్ కారణంగా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా ఆమె రెండుసార్లు కనిపించకుండా పోవడంతో ప్రియలో మరింత ఆశక్తి మొదలవుతుంది. ఆమె అల్జీమర్స్ కారణంగా వెళ్లిపోయిందా ? లేదంటే తన కొడుకు వింత ప్రవర్తన వల్ల తప్పించుకొని పోయిందా? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కథ మరింత ఆసక్తిగా మారుతుంది.
ఇక ప్రియా.. మాన్యుయేల్ లైఫ్ గురించి ఇన్వేస్టిగేట్ చేయడం మెుదలు పెడుతుంది. ఇందులో భాగంగా మాన్యుయేల్ గురించి ప్రియకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇక ఈ క్రమంలోనే ప్రియా అనుకోని చిక్కుల్లో పడిపోతుంది. ఆపై వీటి నుంచి ఎలా బయటపడుతుంది? తన కుటుంబం ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? అనేదే ఈ మూవీ కథ. గత ఏడాది విడుదలైన సినిమాల్లో బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ గా నిలిచిన ఈ చిత్రం.. ప్రస్తుతం ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది.
ALSO READ : చక్రవాకం సీరియల్ హీరోయిన్ స్రవంతి గుర్తుందా.. ఇప్పుడెలా మారిపోయిందో చూడండి