Cochin Shipyard: డిగ్రీ పూర్తి చేసి.. సంబంధిత రంగలో కొంచెం ఎక్స్ పీరియన్స్ ఉన్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. మాల్పే, కర్నాటకలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష్ రిలీజ్ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ఉంటుంది. ఇందులో భారీ వేతనం కల్పిస్తారు.
మాల్పే(కర్ణాటక)లోని ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజిరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం.
ఇందులో ఉన్న మొత్తం ఉద్యోగాల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ఇందులో అసిస్టెంట్ జనరల్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్(మెషినరీ ఔట్ ఫిట్), డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
అసిస్టెంట్ జనరల్-1
మేనేజర్ -01
డిప్యూటీ మేనేజర్(మెషినరీ ఔట్ ఫిట్)- 1
డిప్యూటీ మేనేజర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్)- 1
డిప్యూటీ మేనేజర్ -1
విద్యార్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. అలాగే కంప్యూటర్ పై అవగాహన ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 జనవరి 31 నాటికి 45 ఏళ్ల మించి ఉండకూడదు.
జీతం: నెలకు అసిస్టెంట్ జనరల్‌కు రూ.80,000 నుంచి రూ.2,20,000
మేనేజర్ ఉద్యోగానికి రూ.60,000 నుంచి రూ.1,80,000
డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రూ.50,000 నుంచి రూ.1,60,000
ఉద్యోగ ఎంపిక విధానం: పీపీటీ, వర్క్ ఎక్స్ పీరియన్స్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఉద్యోగానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 31
అఫీషియల్ వెబ్ సైట్: https://cochinshipyard.in
Also Read: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. లక్షకు పైగా జీతం.. ఇంకా వారం రోజులే గడువు..
అర్హులైన అభ్యర్థులు వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం పొందిన అభ్యర్థులకు భారీ వేతనం లభిస్తుంది. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.