Journalism Admissions: జర్నలిజం చేయాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. టెన్త్ క్లాస్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ అపార్చునిటీ అనే చెప్పవచ్చు. ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం (ఏపీసీజే) లో జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారందరూ ఈ జర్నలిజం కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి. ఇదే మంచి అవకాశం. జర్నలిజం కోర్సు నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం (ఏపీసీజే), 2025–26 విద్యాసంవత్సరానికి జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కోర్సులు ప్రభుత్వ గుర్తింపు పొందినివే అని అధికారులు పేర్కొన్నారు. అర్హత ఉండి జర్నలిజంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 19 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం (ఏపీసీజే)లో పలు రకాల కోర్సులు ఉన్నాయి. ఇందులో పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (పీజీడీజే), డిప్లొమా ఇన్ జర్నలిజం (డీజే), డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం (డీటీవీజే), సర్టిఫికెట్ కోర్సు ఇన్ జర్నలిజం (సీజే) కోర్సులు ఉన్నాయి.
పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం: 12 నెలల కాల వ్యవధి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిప్లొమా ఇన్ జర్నలిజం: 6 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం (డీటీవీజే): 6 నెలల కాల వ్యవధి ఉంటుంది. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ జర్నలిజం (సీజే): కోర్సు 6 నెలల కాల వ్యవధి ఉంటుంది. పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 19
అడ్మిషన్లకు చివరి తేది: 2025 ఏప్రిల్ 28
కోర్సులు చేసే విధానం:
ఈ కోర్సులను రెగ్యులర్ గానూ, కరస్పాండెంట్ పద్ధతి (దూర విద్య) లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ తరగతులు సౌకర్యం ఉంటుంది. ఇంటి వద్ద నుంచే లైవ్ క్లాస్ లు వినొచ్చు. తెలుగు లేదా ఇంగ్లిష్ ను బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి.
బోధనా మాధ్యమం: తెలుగు ఆర్ ఇంగ్లిష్
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: www.apcj.in
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 19
అడ్మిషన్లకు చివరి తేది: ఏప్రిల్ 28
Also Read: CSIR-CRRI: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.63,200, దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
Also Read: EdCIL India Limited: సొంత రాష్ట్రంలో 103 ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.. జీతం రూ.30,000