Bharat Ane Nenu: ఈరోజుల్లో కొత్త సినిమాలు కూడా చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని ప్రేక్షకులు సైతం రీ రిలీజ్‌లు చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు. ఇప్పుడు పాత సినిమాలను కొత్తగా థియేటర్లలో చూడడమే ట్రెండ్ అయిపోయింది. రీ రిలీజ్‌కు వెళ్లడం, దానిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం మూవీ లవర్స్‌కు అలవాటుగా మారింది. అందుకే మేకర్స్ సైతం ఈ సందర్భాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పాత సినిమాల రీల్స్ అన్నీ తీసి రీ రిలీజ్‌లకు సిద్ధమవుతున్నారు. తాజాగా మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ మూవీ రీ రిలీజ్‌ను కూడా ప్రకటించేశారు మేకర్స్.
ఏంట్రా ఈ ట్రెండ్
ఇప్పటికే మహేశ్ బాబు హీరోగా నటించిన ఎన్నో పాత సినిమాలు ఈ ఏడాదిలో రీ రిలీజ్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ప్రస్తుతం మహేశ్ బాబు రాజమౌళి హీరోగా ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ విడుదల అవ్వడానికి కనీసం మూడేళ్లు అయినా పడుతుంది. అందుకే తన పాత సినిమాల నిర్మాతలు అందరూ ఈ సందర్భాన్ని క్యాష్ చేసుకోవడానికి సిద్ధమయ్యారని అనిపిస్తోంది. అలా తను నటించిన ఎన్నో సినిమాలు గతేడాదిలో, ఈ ఏడాదిలో రీ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్‌ను అలరించాయి. అదే లిస్ట్‌లోకి ఇప్పుడు ‘భరత్ అనే నేను’ కూడా యాడ్ అయ్యింది. కానీ ఈ రీ రిలీజ్‌ల ట్రెండ్ ఫ్యాన్స్‌కు సైతం విసుగు రప్పిస్తోంది.
బుకింగ్స్ ఓపెన్
కొరటాల శివ, మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘భరత్ అనే నేను’. ఇందులో మహేశ్ మొదటిసారి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించాడు. ఒక మంచి సోషల్ మెసేజ్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడంతో అప్పట్లో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ అంటేనే ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. ఏప్రిల్ 26న ‘భరత్ అనే నేను’ రీ రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అంతే కాకుండా దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని కూడా తెలిపారు. కానీ దీనికి ఫ్యాన్స్ దగ్గర నుండి అంతగా పాజిటివ్ రియాక్షన్ రావడం లేదు. మహేశ్ ఫ్యాన్స్ సైతం ఈ రీ రిలీజ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
Also Read: ‘మద్రాసి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మురుగదాస్ స్పీడ్‌కు ఫ్యాన్స్ షాక్..
అప్డేట్ ఇవ్వండి
‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) సినిమా డ్యూరేషన్ దాదాపుగా 3 గంటలు ఉంటుంది. ఇలాంటి ఒక సోషల్ మెసేజ్ సినిమాను మూడు గంటల పాటు ఒకసారి చూడడం ఓకే కానీ మళ్లీ మళ్లీ చూడడం ఎలా సాధ్యమంటూ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అప్పట్లో ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇప్పుడు డీవీవీ నిర్మాణంలో పలు సినిమాలు విడుదలకు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ కూడా ఒకటి. ఒకవైపు పవన్ కళ్యాణ్.. ఈ సినిమా షూటింగ్‌కు డేట్స్ ఇవ్వకపోవడంతో ఇది మరీ లేట్ అవుతోంది. అందుకే ‘భరత్ అనే నేను’ రీ రిలీజ్ గురించి కాకుండా ‘ఓజీ’ అప్డేట్స్ ఇస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అంతఃకరణ శుద్ధితో……#BharatAneNenu Advance Bookings open soon 💥💥
Worldwide Re-Releasing on April 26th. pic.twitter.com/QlKTRQOf9j
— DVV Entertainment (@DVVMovies) April 15, 2025