Jobs in NARL: నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్. ఫిజిక్స్, అట్మాస్పియరిక్ సైన్స్, స్పేస్ ఫిజిక్స్, మెటలార్జీ విభాగాల్లో పీజీతో పాటు సీఎస్ఐఆర్- యూజీసీ నెట్, గేట్, జామ్, జేఈఎస్‌టీ పాసై ఉన్న వారికి మంచి అవకాశం. ఏపీ, తిరుపతిలోని నేషనల్ అట్మాస్పియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(NARL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్, తిరుపతిలోని నేషనల్ అట్మాస్మియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ(NARL)లో జూనియర్ రీసెర్చ్ పోస్టులు ఉద్యోగాలను భర్తీ చేసేందకు నోటిఫికేషన్ వెలుబడింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లోదరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 19
ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వయస్సు: దరఖాస్తు చివరి తేది నాటికి 28 ఏళ్ల వయస్సు మించరాదు. (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.)
విద్యార్హత: ఫిజిక్స్, అట్మాస్పియరిక్ సైన్స్, స్పేస్ ఫిజిక్స్, మెటలార్జీ విభాగాల్లో పీజీతో పాటు సీఎస్ఐఆర్- యూజీసీ నెట్, గేట్, జామ్, జేఈఎస్‌టీ పాసైన వారు ఈ ఉద్యోగానికి అర్హులవుతారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.37,000 జీతం ఉంటుంది. రెండు సంవత్సరాల తర్వాత జీతం రూ.42,000 అవుతోంది.
దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 24
అఫీషియల్ వెబ్ సైట్: https://www.narl.gov.in/
Also Read: Jobs in CSIR: CSIR-CRRIలో ఉద్యోగాలు.. ఈ జాబ్ గిట్ల వస్తే నెలకు రూ.1,35,000.. రెండు రోజులే ఛాన్స్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. సొంత రాష్ట్రంలో జాబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎలిజబిలిటీ ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.