MLA Danam: రోడ్లు వెడల్పు నేపథ్యంలో అడ్డుగోలుగా కూల్చివేతలకు అధికారులు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అధికారులు ఏకపక్షంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాన్నారు. ఇలా చేస్తే రోజూవారి వ్యాపారాలు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రోడ్డుపై వ్యాపారాలు పెట్టుకుని జీవితం సాగిస్తున్న వారి శాపనార్థాలు మంచిది కావన్నారు. అధికారులు మరోలా చేస్తున్నారని మనసులోని మాట బయటపెట్టారు. ఇలా కూల్చివేస్తే రోజువారీ వ్యాపారం చేసుకునేవాళ్ల పరిస్థితి ఏంటన్నారు. ఈ క్రమంలో కుమారి ఆంటీ విషయాన్ని గుర్తు చేశారు.
అలాంటి పాలసీ గనుక తీసుకుంటే, తొలుత ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఇది రాజకీయానికి సంబంధించిన విషయమని, కేవలం పేద ప్రజల జీవితాల ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వ పరంగా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కాబట్టి, తాను మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు.
తామే సుప్రీం అనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, ఇది మంచిది కాదన్నారు. ప్రభుత్వ ఆలోచనను పరిగణనలోకి తీసుకుని పని చేయాలన్నారు. బాధ్యత అనేది ప్రజాప్రతినిధులకు ఉంటుందని, అందుకే ప్రజల ఆవేదనను బయటపెట్టినట్టు తెలిపారు.
ALSO READ: బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ రుసరుస.. పదేళ్లు చేసింది చాలు
అధికారులు ఏకపక్షంగా కూల్చివేతలు జరుపుతున్నారు
ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాను
రోజూవారి వ్యాపారాలు చేసుకునే వారిని అధికారులు ఇబ్బంది పెడుతున్నారు
– ఎమ్మెల్యే దానం నాగేందర్ pic.twitter.com/oLZ9fyXPOs
— BIG TV Breaking News (@bigtvtelugu) January 23, 2025