Jobs in CSIR: బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఈ, పీహెచ్‌డీ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్- సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(సీఆర్ఆర్ఐ)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ వచ్చేసింది. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో దరఖాస్తు చేసుకోవచ్చు.
సీఎస్ఐఆర్- సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(సీఆర్ఆర్ఐ)లో సైంటిస్ట్ గ్రేడ్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 23
ఇందులో సైంటిస్ట్ గ్రేడ్-4 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
విద్యార్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంటెక, పీహెచ్‌డీ, ఎంఈ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 32 ఏళ్ల వయస్సు మించి ఉండకూడదు.
ఉద్యోగం ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్య నెలకు రూ.1,35,000
దరఖాస్తు ఫీజు: రూ. 500 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.)
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 25
అఫీషియల్ వెబ్ సైట్: https://crridom.gov.in/recruitment
ఆన్ లైన్ అప్లికేషన్ లింక్: https://devapps.ngri.res.in/CrriSci2024/
Also Read: Jobs In INCOIS: రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు.. ఈ అర్హతే అప్లై చేయండి.. నెలకు రూ.67,000 జీతం
అర్హత ఉన్న అభ్యర్థులందరూ సీఎస్ఐఆర్- సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(సీఆర్ఆర్ఐ)లో సైంటిస్ట్ గ్రేడ్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇదే మంచి అవకాశం. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.