BigTV English

Tollywood IT Rides: దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు.. స్పందించిన వెంకటేష్..!

Tollywood IT Rides: దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు.. స్పందించిన వెంకటేష్..!

Tollywood IT Rides:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిల్ రాజు (Dilraju) మళ్లీ గట్టి కం బ్యాక్ ఇచ్చారని చెప్పవచ్చు. ఈ సంక్రాంతికి ఏకంగా రెండు సినిమాలను ఆయన విడుదల చేశారు. అందులో రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’తో పాటు మరొకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా మారినా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేసి, నిర్మాతకు మంచి ఆదాయాన్ని అందించింది. అలా తమ సినిమాలు విడుదలైన వేళ సంతోషంగా ఉన్న దిల్ రాజు కి సడన్ షాక్ ఇచ్చారు ఐటి అధికారులు. దిల్ రాజుతోపాటు శిరీష్, దిల్ రాజు కుమార్తె హన్సితా రెడ్డి నివాసాలలో అలాగే ఆఫీసులలో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరే కాకుండా ‘పుష్ప 2’ మేకర్స్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు పుష్ప2 డైరెక్టర్ సుకుమార్(Sukumar ) ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


ఐటీ సోదాలపై స్పందించిన వెంకటేష్..

ఇలా గత రెండు రోజులుగా బడా నిర్మాతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు దీనిపై స్పందించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఇదిలా ఉండగా తాజాగా దిల్ రాజు నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హీరో వెంకటేష్(Venkatesh) అలాగే ఆ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil ravipudi) స్పందించారు. మొదట హీరో వెంకటేష్ (Venkatesh )ఈ సోదాలపై మాట్లాడారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ.. “గత మూడు రోజులుగా నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం నాకు తెలియదు” అంటూ ఆయన స్పందించారు.


ఐటీ దాడులపై స్పందించిన అనిల్ రావిపూడి..

అనిల్ రావిపూడి (Anil ravipudi) కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్ లో పాల్గొనగా.. దీనిపై ఆయన మాట్లాడుతూ.. “దిల్ రాజు పైనే కాదు పలువురు ప్రముఖులపై కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సుకుమార్ (Sukumar) ఇంట్లో కూడా దాడులు జరిగాయి. కానీ నాపై ఎలాంటి దాడులు జరగలేదు అంటూ తెలిపారు. అంతేకాదు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇండస్ట్రీలో ఐటీ సోదాలు జరగడం సర్వసాధారణమని” కూడా తెలిపారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

బ్లాక్ మనీని బయట పెట్టడమే ధ్యేయం..

ఇకపోతే చాలామంది టాక్స్ ఎగ్గొట్టడానికి వచ్చిన డబ్బును బ్లాక్ మనీ రూపంలో దాచుకుంటున్నారనే వాదనలు, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాచిపెట్టిన నల్లధనాన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు ఐటి అధికారులు. అందులో భాగంగానే దాదాపు 200 మంది అధికారులు రంగంలోకి దిగినా.. ఇప్పటివరకు సరైన ఆధారాలు ఏవి కూడా లభించలేదని సమాచారం.మరొకవైపు ఐటి అధికారులు సోదాలు నిర్వహించడానికి వస్తున్నారని ముందే నిర్మాతలకు తెలిసి ఉంటుంది అనే కామెంట్లు కూడా నెటిజన్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా నిర్మాతల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులకు ఎలాంటి ఆధారాలు లభిస్తాయో చూడాలి అని నెటిజన్స్ సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×