World’s Longest Railway Tunnel: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన రైల్వే లైన్లు ఉన్నాయి. కొన్ని సముద్రం మీదుగా కొనసాగితే, మరికొన్ని లోయలు, పర్వతాల మీదుగా అత్యంత సవాళ్లతో కూడి ఉన్నాయి. కొన్ని చోట్ల రైల్వే లైన్ల కోసం పర్వతాలను తొలచి సొరంగాలను ఏర్పాటు చేశారు. వీటిలో నుంచి రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. భారత్ లోనూ పలు రైళ్లు సొరంగ మార్గాల ద్వారా వెళ్తున్నాయి. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే టన్నెల్ గురించి మీకు తెలుసా? ఇది ఎన్ని కిలో మీటర్లు ఉంటుందంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే టన్నెల్
గోథార్డ్ బేస్ టన్నెల్. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే టన్నెల్. ఇదో ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే టన్నెల్ స్విస్ ఆల్ప్స్ లో ఉంది. ఉరి- టిసినో మధ్య ఏకంగా 35.5 మైళ్ల దూరంలో విస్తరించి ఉంటుంది. ఈ టన్నెల్ గుండా రైలు బయటకు వెళ్లేందుకు ఏకంగా 20 నిమిషాల సమయం పడుతుంది. ఆల్ప్స్ కు ఇరువైపులా ఉన్న ప్రసిద్ధ ప్రదేశాలను చూసేందుకు వెళ్లే పర్యాటకులు, స్థానికులకు అనుకూలంగా ఉండేలా ఈ టన్నెల్ ను నిర్మించారు. గోథార్డ్ బేస్ టన్నెల్ స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ నుంచి ఇటలీలోని మిలన్ వరకు ప్రయాణ సమయాన్ని కేవలం 2.5 గంటలకు తగ్గించడానికి నిర్మించారు.
1940లో ప్రణాళికలు.. 2016లో ప్రారంభం..
గోథార్డ్ బేస్ టన్నెల్ ను ప్రతిపాదనలు 1940లో రెడీ అయ్యాయి. రెండు అంతస్తుల బేస్ టన్నెల్ గా ప్రతిపాదించబడింది. ఇందులో ఒకటి ప్యాసింజర్లు వెళ్లేలా, మరొకటి సరుకు రవాణా రైళ్లు వెళ్లేలా రూపొందించారు. దీని నిర్మాణం నవంబర్ 1999లో ప్రారంభమైంది. జూన్ 2016లో ఈ టన్నెల్ నుంచి రైల్వే ప్రయాణాలు మొదలయ్యాయి. ప్రస్తుతం యూరప్ అంతటా ఫుడ్, ఇంధనం, నిర్మాణ సామగ్రితో సహా వివిధ రకాల వస్తువులను రవాణా చేయడానికి గోథార్డ్ బేస్ టన్నెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లు ఈ సొరంగం ద్వారా వేగంగా దూసుకుపోతాయి. ప్యాసింజర్ రైళ్లు ఈ టన్నెల్ లో గంటలకు 125 మైళ్ల వేగంతో వెళ్తాయి. ఒకవేళ అవసరం అనుకుంటే వేగాన్ని గంటకు 155 మైళ్ల వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. జపాన్ బుల్లెట్ రైళ్లు, ఫ్రాన్స్ టీజీవీ కంటే ఇందులో ప్రయాణించే రైలు 45 కిలో మీటర్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.
Read Also: దేశంలో అత్యంత పురాతనమైన రైళ్లు ఇవే.. ఎన్నేండ్ల క్రితం పట్టాలెక్కాయో తెలుసా?
సీకాన్ టన్నెల్ రికార్డు బ్రేక్ చేసిన గోథార్డ్ బేస్ టన్నెల్
ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే టన్నెల్ అయినప్పటికీ, జపాన్ లోని సుగారు జలసంధిలోని సీకాన్ టన్నెల్, UK, ఫ్రాన్స్ ను కలిపే ఛానల్ టన్నెల్స్ కూడా వేగవంతమైన రైల్వే మార్గాలుగా గుర్తింపు పొందాయి. సీకాన్ టన్నెల్ 1988లో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇది 33.5 మైళ్ల పొడవు ఉంటుంది. గోథార్డ్ బేస్ టన్నెల్ ప్రారంభం అయ్యక, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే టన్నెల్ గా గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్, అందులో ఓ రహస్య ఫ్లాట్ ఫారమ్, ఇంతకీ దాని కథేంటో తెలుసా?