BigTV English

Manager Jobs: SBIలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,00,000 జీతం.. జస్ట్ ఈ అర్హతలుంటే చాలు..!

Manager Jobs: SBIలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,00,000 జీతం.. జస్ట్ ఈ అర్హతలుంటే చాలు..!

Manager Jobs: కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, డేటా సైన్స్‌, ఏఐ, ఎంఎల్‌ విభాగాల్లో బీటెక్, బీఈ, ఎంటెక్ పాసైన వారికి, అలాగే ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్నఅభ్యర్థులందరూ ఆన్ లైన్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా కల్పించనున్నారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.


నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) ముంబయి ఖాళీగా ఉన్న మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 42


ఇందులో మేనేజర్(డేటా సైంటిస్ట్), డిప్యూటీ మేనేజర్(డేటా సైంటిస్ట్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు ఖాళీల వారీగా..

మేనేజర్(డేటా సైంటిస్ట్): 13 ఉద్యోగాలు

డిప్యూటీ మేనేజర్(డేటా సైంటిస్ట్): 29 ఉద్యోగాలు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విబాగంలో లో బీఈ, బీటెక్‌, ఎంటెక్‌( కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, డేటా సైన్స్‌, ఏఐ, ఎంఎల్‌), ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మేనేజర్ ఉద్యోగానికి 26 నుంచి 36 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి 24 నుంచి 32 ఏళ్లు మించి ఉండరాదు.

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. నెలకు మేనేజర్‌కు రూ.85,920 – రూ.1,05,280, డిప్యూటీ మేనేజర్‌కు రూ.64,820 – రూ.93,960 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వయూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 24

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.co.in/web/careers/

Also Read: Manager Jobs: సువర్ణవకాశం.. డిగ్రీ, బీటెక్ అర్హతలతో ఉద్యోగాలు.. జాబ్ వస్తే లక్షకు పైగా జీతం..

అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, డేటా సైన్స్‌, ఏఐ, ఎంఎల్‌ విభాగాల్లో బీటెక్, బీఈ, ఎంటెక్ పాసైన వారికి, అలాగే ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఉంటుంది. ఇంత మంచి అవకాశాన్ని అర్హత ఉన్న అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

 

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×