Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీని ఈసారి పాకిస్తాన్ నిర్వహించబోతున్న {Pakistan hosts 2025 Cricket Championship} విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ప్రారంభమై.. మార్చి 9న ముగుస్తుంది. 1998 నుండి ఈ టోర్నీని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. 2006 వరకు రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ టోర్నీ.. అప్పటినుండి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని ప్రణాళిక చేశారు. కానీ ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్నారు.
Also Read: Shubman Gill: అదిరిపోయే క్యాచ్ పట్టిన గిల్.. 20 మీటర్లు పరిగెత్తి మరి ?
చాలాకాలం తర్వాత భారత్ – పాకిస్తాన్ క్రికెట్ జట్లు త్వరలో ఈ టోర్నీలో తెలపడబోతున్నాయి. ఫిబ్రవరి 23న జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. అయితే రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో గెలవడమే కాకుండా.. భారత జట్టును ఓడించడం పాకిస్తాన్ కి నిజమైన సవాల్ అని అన్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. ఈ సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రస్తుతం మన జట్టు చాలా బాగుందని.. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే కాకుండా.. దుబాయిలో జరిగే మ్యాచ్ లో మన చిరకాల ప్రత్యర్థి భారత్ ని ఓడించాలని అన్నారు.
అలాగే 29 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్.. ఐసీసీ ఈవెంట్ ని నిర్వహించడం గొప్ప సందర్భం అని అభిప్రాయపడ్డారు. కాగా వన్డే, టి-20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు ఆదిక్యం సాధించింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం వెనుకంజలోనే నిలిచింది. ఇలా భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన హోరాహోరీ పోరు, రికార్డులను పరిశీలిస్తే.. టి-20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ లలో పాకిస్తాన్ పై భారత్ పైచేయి సాధించగా.. గత చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో మాత్రం పాకిస్తాన్.. భారత జట్టుపై గెలుపొందింది.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో ప్రారంభం కాగా.. అప్పటినుండి ఈ టోర్నీలో భారత్ – పాకిస్తాన్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో పాకిస్తాన్ జట్టు మూడుసార్లు గెలుపొందగా.. భారత్ మాత్రం రెండుసార్లు గెలుపొందింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ – భారత్ జట్లు రెండు మ్యాచ్ లు ఆడాయి. ఇందులో గ్రూప్ దశలో భారత జట్టు పాకిస్తాన్ ని ఓడించగా.. ఫైనల్ లో మాత్రం పాకిస్తాన్ గెలుపొందింది. ఈ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్ లో జరగబోతోంది.
Also Read: Nitish Kumar Reddy: తండ్రికి నితీశ్ కుమార్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్
ఇక రెండు జట్ల వన్డే రికార్డు పరిశీలిస్తే.. ఇందులో కూడా పాకిస్తాన్ జట్టు భారత జట్టు కంటే ముందంజలో ఉంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 135 అంటే మ్యాచ్ లు జరగగా.. ఇందులో భారత జట్టు 57 మ్యాచ్ లలో మాత్రమే గెలుపొందింది. ఇక పాకిస్తాన్ మాత్రం 73 మ్యాచ్ లలో గెలిచి ముందంజలో ఉంది. మరో ఐదు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. దీంతో ఫిబ్రవరి 23న భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో..? అన్న ఆసక్తి ఇరుదేశాల క్రీడాభిమానులలో నెలకొంది.