BigTV English

L2E Empuraan: మోహన్‌లాల్ సినిమాలో హాలీవుడ్ యాక్షన్ యాక్టర్స్.. సర్‌ప్రైజ్ స్పాయిల్ చేసిన మేకర్స్..

L2E Empuraan: మోహన్‌లాల్ సినిమాలో హాలీవుడ్ యాక్షన్ యాక్టర్స్.. సర్‌ప్రైజ్ స్పాయిల్ చేసిన మేకర్స్..

L2E Empuraan: ఈరోజుల్లో హాలీవుడ్ మేకర్స్ సైతం ఇండియన్ సినిమా వైపు తిరిగి చూస్తున్నారు. ఇండియన్ సినిమా మేకింగ్, టేకింగ్‌కు ఎంతోమంది ఇంగ్లీష్ స్టార్ డైరెక్టర్స్ సైతం ఫిదా అయ్యారు. అందుకే ఒకప్పుడు ఇండియన్ యాక్టర్స్ వెళ్లి హాలీవుడ్ సినిమాల్లో నటించడానికి కష్టపడేవాళ్లు. కానీ ఇప్పుడు హాలీవుడ్ యాక్టర్సే వచ్చి ఇండియన్ సినిమాల్లో నటించడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా మోహన్ లాల్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో కూడా ఇద్దరు హాలీవుడ్ యాక్షన్ హీరోలు ఉన్నారని దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. దానిని మేకర్స్ అంతా కలిసి ఒక సర్‌ప్రైజ్ లాగా రివీల్ చేద్దామని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆ సర్‌ప్రైజ్ బయటికి వచ్చేసింది.


ఇంట్రెస్టింగ్ అప్డేట్

పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో మోహన్ లాల్ (Mohanlal) నటిస్తున్న చిత్రమే ‘ఎల్2ఈ ఎంపురాన్’. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘లూసీఫర్’ అనే సినిమా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఎంపురాన్‌ను మరింత భారీ బడ్జెట్‌తో దానికి సీక్వెల్‌గా తెరకెక్కించాడు పృథ్విరాజ్ సుకుమారన్. తాజాగా విడుదలయిన ఈ మూవీ టీజర్ చూస్తుంటే దీనిపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను అందుకునేలా ఉందని తెలుస్తోంది. ‘లూసీఫర్’ కంటే మరింత గ్రాండ్‌గా ఈ సినిమాపై ఫోకస్ చేశాడు పృథ్విరాజ్. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లుగా కష్టపడుతున్నారు మేకర్స్. తాజాగా ‘ఎల్2ఈ ఎంపురాన్’ గురించి ఒక ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.


రివీల్ అయిపోయింది

‘ఎల్2ఈ ఎంపురాన్’లో పలువురు ఇంటర్నేషనల్ యాక్టర్స్ నటిస్తున్నట్టుగా ఇంతకు ముందే రివీల్ అయ్యింది. అయితే తాజాగా యూకేకు చెందిన మరో ఇద్దరు నటులు కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హాలీవుడ్‌కు చెందిన ఒక ఏజెన్సీ ఈ విషయాన్ని తాజాగా రివీల్ చేసింది. కొరియన్ అమెరికన్ యాక్టర్స్ అయిన రిక్ యూన్, ఆండ్రియా టివాడర్ కూడా ఈ సినిమాలో నటించనున్నట్టు ఆ ఏజెన్సీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సోషల్ మీడియా పోస్టును తర్వాత ఆ ఏజెన్సీ డిలీట్ చేసేసినా కూడా ఇప్పటికీ వెబ్‌సైట్‌లో మాత్రం ఈ పోస్ట్ అలాగే ఉంది. దీంతో ‘ఎల్2ఈ ఎంపురాన్’ గురించి ఈ అప్డేట్ వైరల్ అవుతోంది.

Also Read: కలిసి కసరత్తులు చేస్తున్న మెగా హీరోలు.. ఎంత చూడముచ్చటగా ఉన్నారో.!

ఇంటర్నేషనల్ గుర్తింపు

తాజాగా ‘ఎల్2ఈ ఎంపురాన్’ (L2E Empuraan) టీజర్ విడుదల తర్వాత వెంటనే ఈ సినిమా గురించి ప్రమోషన్స్ మొదలుపెట్టాడు పృథ్విరాజ్ సుకుమారన్. కానీ ఇందులో నటించే క్యాస్టింగ్ ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ఫారిన్ యాక్టర్లు ఉండడం వల్ల అది ఈ మూవీకే ప్లస్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. రిక్ యూన్.. ఇప్పటికే ‘స్నో ఫాలింగ్ ఆన్ సెడార్స్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 1’తో పాటు మరెన్నో యాక్షన్ సినిమాలు, సిరీస్‌లో నటించి ఇంటర్నేషనల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. మొత్తానికి ‘ఎల్2ఈ ఎంపురాన్’ మూవీ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×