ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది శుభవార్త. మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఈ కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఫోర్‌మెన్ సహా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ నియామక ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే చేపట్టనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 150
మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందులో అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్ ట్రెయినీ) విభాగంలో 150 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్ ట్రెయినీ) విభాగంలో 350 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటగిరీల వారీగా రిజర్వేషన్లు వర్తిస్తాయి.
విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ లేదా టెన్త్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యాార్హతలతో పాటు నిర్ణీత పని అనుభవం కూడా కలిగి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 2026 మే 28వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ అలాగే ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు.. ఇంకా ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలు అందుతాయి. అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టుకు నెలకు రూ.47,330 వేతనం లభిస్తుంది. టెక్నీషియన్ పోస్టుకు ఎంపికైన వారికి రోజుకు రూ.1,583 చొప్పున చెల్లిస్తారు. వీటితో పాటు ఇతర అలవెన్సులు సంస్థ నిబంధనల మేరకు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 మే 7
చివరి తేదీ: 2026 మే 28
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1,180 (GSTతో కలిపి) చెల్లించాలి. ఎస్సీ ఇంకా ఎస్టీ లేదా పీడబ్ల్యూబీడీ అభ్యర్థులతో పాటు మహిళలు ఇంకా మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఈ ఉద్యోగాలకు కేవలం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారానే ఎంపిక నిర్వహిస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూలు ఉండవు. రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో సెక్షన్-A లో జనరల్ అవేర్‌నెస్ లేదా ఆప్టిట్యూడ్ నుంచి 20 మార్కులు అడుగుతారు. సెక్షన్-B లో టెక్నికల్ సబ్జెక్టుల నుంచి 80 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు నెగటివ్ మార్కులు లేకపోవడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.
అర్హత కలిగిన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది. మరిన్ని వివరాల కోసం మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.mahanadicoal.in/
ALSO READ: పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 668 ఉద్యోగాలు.. ఐటీఐ, డిగ్రీ పాసైతే చాలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే