E-Paper
Advertisement

పైసలు పక్కదారి పడితే మీ పని పటా పంచెలే.. కలెక్టర్ వార్నింగ్!

పైసలు పక్కదారి పడితే మీ పని పటా పంచెలే.. కలెక్టర్ వార్నింగ్!
Advertisement

Panchayat Funds:  పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని.ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరిం. చాలని సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 15 ఆర్ధిక సంఘం నిధుల వినియోగం పై వర్క్ షాప్ నిర్వహించారు.

15 వ ఆర్ధిక సంఘం నిధులు..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో 15 వ ఆర్ధిక సంఘం నిధులు సక్రమంగా వినియోగించి గ్రామా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు మోడల్ గా తీర్చిదిద్దాలని, గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు, అంగన్వాడీ బిల్డింగ్స్, జిపి బిల్డింగ్స్ లేని గ్రామాలకు నూతన బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ సమన్వయంతో గ్రామ పంచాయతీలో పనులు సవ్యంగా నడవాలన్నారు.

Advertisement

Also read: కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు.. ఈనెల 20న సీఎంతో కలిసి సందర్శన, ఆ విధంగా ముందుకు

త్రాగు నీటి సమస్య..

గ్రామాల్లో సమస్యలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని 15 ఆర్ధిక సంఘం నిధులను అన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించిందని ,వాటితో గ్రామాల్లో సమస్యలు లేకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు. నిధుల వినియోగంలో అక్రమాలకు తావులేదన్నారు. నిధులు సక్రమంగా వినియోగించక పోతే ,అక్రమాలు జరిగితే సర్పంచ్ , కార్యదర్శుల పై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. గ్రామాల్లో త్రాగు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, డిఎల్పిఓలుసాయి బాబు, తిరుపతి రెడ్డి ,అధికారులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also read: శ్రీనిధిలో నిధులు గోల్‌మాల్.. ఆఫీసు రిపేర్ల పేరుతో 10 కోట్లు స్వాహా!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×