Mohammed Shami: టీమిండియా అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami ).. రీ ఎంట్రీ ఇచ్చేశాడు. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రేపటి నుంచి టి20 సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టి 20 సిరీస్ కు సెలెక్ట్ అయిన మహమ్మద్ షమీ… మళ్లీ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 400 రోజుల తర్వాత టీమిండియా జెర్సీ ( Team India Jersy ) వేసుకొని కనిపించాడు మహమ్మద్ షమీ ( Mohammed Shami ). 2023 వన్డే ప్రపంచ కప్ ( ODI World Cup 2023 ).. సమయంలో టీమిండియా కు అపార సేవలు అందించిన మహమ్మద్ షమీ.. చివరగా గాయపడ్డాడు.
Also Read: U19 Women’s T20 World Cup 2025: వైష్ణవికి హ్యాట్రిక్.. మలేషియాపై 2 ఓవర్లలోనే టీమిండియా విక్టరీ
ఆ తర్వాత… విదేశాల్లో తన చీల మండల గాయానికి శాస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ వేయడం ప్రారంభించాడు. దేశవాళీ క్రికెట్లో ఆడి… తన టాలెంట్ మరోసారి నిరూపించుకొని సెలెక్టర్ల కన్ను పడేలా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా ( Team India ) వర్సెస్ ఇంగ్లాండ్ ( England ) మధ్య జరిగే టి20 సిరీస్ కు సెలెక్ట్ అయ్యాడు మహమ్మద్ షమీ. అయితే టి20 సిరీస్ కు సెలెక్ట్ అయిన మహమ్మద్ షమీ ( Mohammed Shami ).. ఇవాళ టీమిండియా జెర్సీ వేసుకొని కనిపించాడు.
టీమిండియా జెర్సీ ( Team India Jersy ) వేసుకున్న మహమ్మద్ షమీ ( Mohammed Shami ) ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఐయామ్ బ్యాక్ అన్నట్లుగా… మహమ్మద్ షమీ ఫోజ్ ఇచ్చాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన టీమిండియా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. చాలా రోజుల తర్వాత మహమ్మద్ షమీ జట్టులోకి రావడం… శుభసూచకమని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక తన రీ ఎంట్రీపై టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami ).. స్పందించారు. “దేశం కోసం ఆడాలనే ఆకలి ఎప్పటికీ తీరకూడదని నేను భావిస్తున్న. అదే నా మొదటి విషయం. భారత క్రికెట్ జట్టుకు ఆడాలంటే ఆకలి ఉండాలి. నాకు చాలా ఆకలిగా ఉంది, భారత్ తరఫున ఆడాలనే కోరిక నాకు ఉంది. నా చివరి శ్వాస వరకు భారత్ తరఫున ఆడాలని అనుకుంటున్నా’ అని చెప్పాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami ). ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం ఇటీవల భారత జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ ప్లేయర్ల లిస్టులో కూడా మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Also Read: ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై ‘పాకిస్థాన్ పేరు’..PCB దూల తీర్చిన BCCI?
MOHAMMAD SHAMI IN TEAM INDIA JERSEY.
– The long wait is finally over. 🇮🇳 pic.twitter.com/G3yLNA8ZL9
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2025