BigTV English

Formula E Race Case: బీఆర్ఎస్ దొరికిపోయింది.. ఫార్ములా రేసులో క్విడ్ ప్రోకో?

Formula E Race Case: బీఆర్ఎస్ దొరికిపోయింది.. ఫార్ములా రేసులో క్విడ్ ప్రోకో?

Formula E Race Case: పార్ములా ఈ కారు రేసులో కీలక విషయాలు బయటపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్‌కు కోట్లాది రూపాయల లబ్ది చేకూరినట్టు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ. 41 కోట్లు లబ్ది చేకూరినట్టు తేల్చింది. దీంతో ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది.


ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఏసీబీ విచారణకు డుమ్మా కొట్టారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన విషయాలు బయటపెట్టింది. ఫార్ములా- ఈ రేస్ నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్లాది రూపాయల లబ్ధి చేకూరిందని తేల్చేసింది.

బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 41 కోట్లు చెల్లించింది గ్రీన్ కో సంస్థ. బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు ఏకంగా 41 సార్లు ఎన్నికల బాండ్ల రూపంలో ముడుపులు చెల్లించింది. ఆ జాబితాను బయటపెట్టింది ప్రభుత్వం.


రేస్‌కు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుంచి బాండ్లను కొనుగోలు చేసింది గ్రీన్ కో సంస్థ. 2022 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య ఆయా బాండ్లను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతిసారి కోటి విలువ చేసే బాండ్లు కొనుగోలు చేసింది గ్రీన్ కో కంపెనీ.

ALSO READ: వచ్చారు, వెళ్లారు.. విచారణ ఎదుర్కోలేక డ్రామా?

ఈ వ్యవహారానికి కౌంటర్ చేయలేక బీఆర్ఎస్ తర్జనభర్జన పడుతోంది. చివరకు మీడియా చిట్ చాట్‌లో కొన్ని విషయాలు బయటపెట్టారు కేటీఆర్. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022 ఏడాది మాత్రమేనని చెప్పిన ఆయన, ఫార్ములా- ఈ రేసు జరిగింది 2023లో జరిగిందన్నారు. గ్రీన్ కో సంస్థ ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్, బీజేపీ‌కి కూడా ఇచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు.

పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి ఎలా అంటారన్నది కేటీఆర్ మాట. తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టిన వివరాలతో బీఆర్ఎస్ మరింత ఇరుకున పడిపోయినట్టు కనిపిస్తోంది. ఈ కేసు నుంచి కేటీఆర్ బయటపడడం కష్టమనే వాదన మరింత బలంగా మారిందని అధికార పార్టీ నేతల మాట.

 

Related News

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Jadcherla bakery: కర్రీ పఫ్ తింటుంటే నోటికి మెత్తగా తగిలింది.. ఏంటా అని చూస్తే పాము!

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Big Stories

×