BigTV English

JACK OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న జాక్… స్ట్రీమింగ్ ఎక్కడ.. ఎప్పటి నుంచి అంటే..?

JACK OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న జాక్… స్ట్రీమింగ్ ఎక్కడ.. ఎప్పటి నుంచి అంటే..?

Jack OTT: టాలీవుడ్ యంగ్ స్టార్ సిద్దు జొన్నలు గడ్డ నటించిన ‘జాక్’ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కొన్ని సినిమాలు వెండితెరపై సక్సెస్ కాలేకపోయినా, బుల్లితెరపై ఆకట్టుకోవడం మనం చూసాం. ఇకపోతే ఇటీవల విడుదలైన సిద్ధూ మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధమైంది. ఆ వివరాలు చూద్దాం..


ఓటీటీలోకి వచ్చేస్తున్న జాక్..

సిద్దు జొన్నలగడ్డ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన సినిమా జాక్. సిద్దు టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీస్ తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా విడుదలైన ‘జాక్’ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కాగా ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ మే 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తమిళ్ కన్నడ హిందీ, మలయాళం లో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స లో అందుబాటులోకి రానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ను మూవీ టీం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సిద్ధూ ఈ మూవీ తో హ్యాట్రిక్ హీట్ కొట్టాలనుకున్నాడు అయితే ఆయన అంచనాలన్నీ తారుమారయ్యాయి. సినిమా భారీ నష్టాలతో డిజాస్టర్ మూవీ గా మిగిలింది. ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో మే 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.


కథ ఏంటంటే..

కథ విషయానికి వస్తే.. ఫ్లోబో నెరుడా అలియాస్ జాక్(సిద్దు ) చుట్టూ కథ తిరుగుతుంది. జాక్ ఒక తెలివైన యువకునిగా చిన్నప్పటినుండి రా ఏజెంట్గా దేశాన్ని కాపాడాలని కలలు కంటూ ఉంటాడు. తనకున్న టాలెంట్ తో ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంటాడు. ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. రిజల్ట్స్ రాకముందే ఖాళీగా ఉండడం ఎందుకని రా ఏజెన్సీకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. ఉగ్రవాదులు హైదరాబాదులో పాటు భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుసుకున్న జాక్ వారిని పట్టుకునేందుకు తన ప్రయత్నాన్ని మొదలు పెడతాడు. జాక్ ఏం చేస్తున్నాడో కనుక్కోమని డిటెక్టివ్ ఆఫీషన్ బేగం ( వైష్ణవి) కు లక్ష రూపాయలు ఇస్తాడు. జాక్ తండ్రి పాన్ ఇండియా ప్రసాద్ (నరేష్ ) ఇక మన హీరోయిన్ జాక్ ని పట్టుకోవడానికి భానుమతి అనే పేరుతో దగ్గరవుతుంది. టెర్రరిస్ట్ ని పట్టుకునే క్రమంలో పొరపాటున రా ఏజెంట్ మనోజ్ ని జాక్ కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది టెర్రరిస్ట్ గ్యాంగ్ ని జాక్ ఎలా అంతమొందించాడు. అసలు ప్రకాష్ రాజ్, జాక్ మధ్య ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేదే మిగిలిన కథ. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సునీల్, ప్రధాన పాత్రలో నటించారు.

మూవీ బజెక్ట్ వివరాలు ..

సిద్దు, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో BVSN ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిన స్పై యాక్షన్ కామెడీ చిత్రం జాక్. ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై, భారీ డిజాస్టర్ గా మిగిలింది. సిద్దు గతంలో చేసిన టిల్లు స్క్వేర్ సినిమా బ్లాక్ బస్టర్ గా మంచి వసూల్ సాధించింది. తొలిరోజే టిల్లు స్క్వేర్ మూవీ 23 కోట్లు వసూలు సంగతి తెలిసిందే, అలాగే జాక్ మూవీ కూడ మంచి కలెక్షన్ వసూలు చేస్తుందని మూవీ టీం భావించింది. కానీ కేవలం 2 కోట్లు కలెక్షన్స్ మాత్రమే తొలిరోజు జాక్ మూవీకి వచ్చాయి. 36 కోట్లతో జాక్ మూవీని నిర్మిస్తే కేవలం 7 కోట్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా డిజాస్టర్ మూవీ గా నిలిచిన ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై అలరించడానికి సిద్ధమైంది.

Subham:డైరెక్టర్ కన్నా రైటర్ గొప్పవాడు అని తెలిపిన నూతన దర్శకుడు

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×