Raashi Khanna Leaked Ustaad Bhagat Singh Best Photo: ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ బర్త్‌డే విషెస్, సెలబ్రేషన్స్‌తో నిండిపోయాయి. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. నేటితో ఆయన 54వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, హీరోహీరోయిన్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్‌తో పాటు ఇటూ దర్శక-నిర్మాతలు ఆయన స్పె షల్ బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ రాశీ ఖన్నా కూడా పవన్‌కి స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ తెలిపింది.
పవన్ కి రాశీ బర్త్ డే విషెస్
ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెంటారాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఓజీ సెట్ నుంచి ఫోటో లీక్ చేసింది. దీంతో అభిమానులంత ఆమె థ్యాంక్స్ చెబుతున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఓజీ,మరోకటి ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీ మూవీ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఉస్తాద్ సెట్‌లో ఆయన సందడి చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాశీ ఖన్నా సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. పలు కీలక సన్నివేశాల్లో ఆమె మెరవనుంది.
ఫ్యాన్స్ కి సర్ప్రైజ్
అయితే ఇటీవల ఈ మూవీ సెట్‌లో అడుగుపెట్టిన ఆమె.. పవన్ కళ్యాణ్‌తో ఉన్న పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా సెట్‌లోని ఓ సీన్‌కి సంబంధించిన ఫో టోని రాశీ ఖన్నా షేర్ చేసింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కి బర్త్‌డే విషెస్ తెలిపింది. “హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్ సర్. మీ శక్తి, క్రమశిక్షణ, ఇంటిగ్రిటీతో నిండిన ఈ ప్రయాణం.. కోట్ల ప్రజలకు స్పూర్తి. ఈ ఏడాది మీకు మరింత ఆరోగ్యం, శాంతి, విజయం కలగాలని కోరుకుంటున్నా”. అంటూ విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉస్తాద్ సెట్‌లోని ఫోటో షేర్ చేసినందుకు ఫ్యాన్స్‌కి రాశీ ఖన్నాకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టీం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఇందులో పవన్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇందులో వపన్ వింటేజ్ లుక్ కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఈ పోస్టర్ మూవీపై బజ్ మరింత పెరిగింది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై యలమంచిలి రవి, నవీన్ యర్నేనీలు నిర్మిస్తున్నారు.
Also Read: OG Glimpse: హైప్ పెంచుతున్న ఓజీ గ్లింప్స్.. పవన్ లుక్‌కి గూస్‌బంప్సే.. చూశారా?