E-Paper
Advertisement

దొంగగా మారిన ధనుష్.. కర సెన్సార్ టాక్.. మెప్పించాడా?

దొంగగా మారిన ధనుష్.. కర సెన్సార్ టాక్.. మెప్పించాడా?
Advertisement

Kara Movie: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా ప్రేక్షకులను అలరించడమే కాకుండా దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించి.. ఆ చిత్రాలలో హీరోగా నటించి కూడా ఆకట్టుకున్నారు. ఇకపోతే తాజాగా మిగతా హీరోలు లాగా కాకుండా ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్న ధనుష్.. గత ఏడాది కుబేర, ఇడ్లీ కొట్టు, తేరే ఇష్క్ మేన్ ఇలా మూడు భాషల్లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు . ఇప్పుడు కర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న కర.. దొంగగా మారిన ధనుష్

విగ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ , మమిత బైజు జంటగా వస్తున్న ఈ చిత్రాన్ని వెల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐషరి కే గణేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన తెలుగు, తమిళ్ భాషలలో విడుదల కాబోతోంది. అంటే రేపు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. 2:41:13 గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని 16 సంవత్సరాల పైబడిన వారు వీక్షించేలా సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ జారీ చేశారు. ఇకపోతే సినిమా చూసిన సెన్సార్ సభ్యులు తమ ఫస్ట్ రివ్యూ ని పంచుకున్నారు . దీంతో తమిళ మీడియాలో ఈ సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు తమిళ్లో కూడా ఈ సినిమాను పలువురు సెలబ్రిటీలు , చిత్ర బృందం కూడా చూసేశారు. మరి ఈ సినిమా స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కర సినిమా స్టోరీ..

Advertisement

కర సినిమా స్టోరీ విషయానికి వస్తే.. 90వ దశకంలో తమిళనాడులోని ఒక గ్రామంలో జరిగిన కథ. కరస్వామి పాత్రలో ధనుష్ నటించాడు. కరస్వామి ఒక దొంగ.. ఆయనపై అందరికీ చెడు అభిప్రాయం ఉంటుంది . కానీ అనుకోకుండా జరిగిన సంఘటనలతో దొంగతనాలు మానేసి సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒక అత్యవసరంతో మళ్లీ బ్యాంకులను దొంగతనం చేస్తాడు. దీంతో పోలీసులు కరస్వామిని పట్టుకోవడానికి వెతుకుతూ ఉంటారు. మరొక పక్క భార్య కూడా కరస్వామిని ప్రశ్నిస్తుంది. దొంగతనాలు ఎందుకు చేస్తున్నావ్ అని.. అసలు కరస్వామి ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు? అతడు మంచోడిగా మారాడా? మారిన కరస్వామి మళ్లీ ఎందుకు దొంగతనాలు చేయాల్సి వచ్చింది? పోలీసులు పట్టుకున్నారా? అనేది సినిమా చూడాల్సిందే.

also read:ఫరియా పూర్వీకులు ముస్లిం కాదా.. నిజాలు బయటపెట్టిన బ్యూటీ!

విశ్లేషణ..

Advertisement

ఇకపోతే సస్పెన్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం బాగున్నప్పటికీ.. రెండవ భాగం యావరేజ్ గా ఉందని సమాచారం . క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉండనుందట. ధనుష్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ కూడా హైలెట్గా నిలవనున్నాయట. అప్పట్లో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసిన ఈయన ఇప్పుడు మళ్లీ అదే పర్ఫామెన్స్ ను చూపించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది .అటు మమిత బైజు డి గ్లామరస్ రోల్ లో అదరగొట్టేసిందట. సింపుల్ కథ అయినా ఆసక్తికర స్క్రీన్ ప్లే తో సినిమాను బాగా తెరకెక్కించారట. మరి తమిళ సినీ వర్గాల నుంచి ఈ స్టోరీ వినిపిస్తోంది. ఇక రేపు ఆడియన్స్ అభిప్రాయాలు ఏ విధంగా వెలువడతాయో చూడాలి.

Related News

వినాయక చవితి స్పెషల్..నయనతార మూకుత్తి అమ్మన్ 2 టీజర్ రిలీజ్!

Varanasi Leak : గుడి దగ్గర ఆ డైనోసర్ ఏంటి..జక్కయ్య నీ ప్లానేంటి సామి..?

గణనాథుడి ఆశీస్సులు అందరికి ఉండాలి.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

Big Stories

Advertisement
×