BigTV English

Group-2 Results: గ్రూప్-2 టాప్ 100 ర్యాంకుల్లో నలుగురే మహిళలు..

Group-2 Results: గ్రూప్-2 టాప్ 100 ర్యాంకుల్లో నలుగురే మహిళలు..

Group-2 Results: తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 783 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 ఎగ్జామ్ లో అభ్యర్థులు పొందిన మార్కులను ఆధారంగా చేసుకుని జనరల్ ర్యాంక్ జాబితా (జీఆర్ఎల్) ను టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెబ్ సైట్ లో పొందుపరిచారు.


783 గ్రూప్-2 పోస్టులకు గానూ డిసెంబర్ 16, 17 తేదీల్లో రేవంత్ సర్కార్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 600 మార్కులకు గానూ నాలుగు పేపర్లుగా నిర్వహించిన ఈ పీరక్షలో మల్టీ జోన్-1 కు చెందిన నారు వెంకట హర్షవర్థన్ రెడ్డి టాప్ స్కోరర్ గా నిలిచారు. అతను 447.088 మార్కులు తెచ్చుకొని స్టేట్ టాపర్ గా నిలిచారు. వడ్లకొండ సచిన్ 44.754 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. మల్టీ జోన్-2 లో బీ. మనోహార్ రావు 439.344 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ పొందగా.. శ్రీ రాం మధు 438.972 మార్కులు సాధించి  సెకండ్ ర్యాంక్ పొందారు.

టాప్-100లో 96 మంది పురుషులే..

అయితే గ్రూప్-2 టాప్ టెన్ ర్యాంకుల్లో అందరూ పురుష అభ్యర్థులే ఉన్నారు. టాప్ -100 లో నలుగురు మాత్రమే మహిళా అభ్యర్థులు ఉండగా.. 96 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. టాప్ – 200 లో అయితే 15 మంది మహిళ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. 185 పురుష అభ్యర్థులు ఉన్నారు. మహిళల్లో మల్టీ జోన్‌-1లో బైకిడి సుష్మిత 406.499 మార్కులతో, మల్టీ జోన్‌-2లో లక్కిరెడ్డి వినీషారెడ్డి 408.713 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. నిన్న టీజీపీఎస్సీ  కార్యాలయంలో ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం, సభ్యులు అమీర్‌ ఉల్లాఖాన్, ప్రొఫెసర్‌ నర్రి యాదయ్య,  వై.రామమోహనరావు, పాల్వాయి రజనీకుమారి, టీజీపీఎస్సీ ఇన్‌ఛార్జి కార్యదర్శి సుమతి గ్రూప్‌-2 పలితాలను టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్ సైట్ లో పొందుపరిచారు. జనరల్‌ ర్యాంకు  జాబితాతో పాటు ప్రశ్నపత్రాలు, తుది కీని వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల ఓఎంఆర్‌ షాట్ కైడా అభ్యర్థుల లాగిన్‌లో పొందు పరిచినట్టు టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.


3 నెలల లోపే ఫలితాలు..

అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం గ్రూప్-2 పరీక్ష ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేశారు. పరీక్షలు జరిగిన మూడు నెలల లోపే జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడించారు. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మధ్యలో రెండు సార్థు ఎగ్జామ్ వాయిదా పడింది. దీంతో 2024 డిసెంబర్ లో రేవంత్ సర్కార్ ఎలాంటి అవరోధాలు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించింది. గ్రూప్-2 పరీక్షలకు 5,51,855 మంది దరఖాస్తు చేయగా.. 2.49 లక్షల మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఓఎంఆర్‌ పత్రాల్లో పొరపాట్లు చేయడం, బబ్లింగ్‌ సరిగా చేయకపోవడం తదితర కారణాలతో 13,315 మంది అభ్యర్థులను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగతా 2,36,649 మందికి వచ్చిన మార్కులతో జనరల్‌ ర్యాంకు జాబితాను టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో పొందుపరిచింది.

ALSO READ: NPCIL Recruitment: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో జాబ్స్.. నోటిఫికేషన్ వచ్చేసింది.. మంచి వేతనం..

ALSO READ: CERC Recruitment: డిప్లొమా, బీటెక్ అర్హతలతో ఉద్యోగాలు.. వేతనం అక్షరాల రూ.1,25,000.. రేపే లాస్ట్ డేట్

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×