CERC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిప్లొమా, బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగంలో కనుకు మీరు సెలెక్ట్ అయితే మంచి వేతనం ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి 45 వేల నుంచి రూ.1,25,000 వరకు జీతం ఇవ్వనున్నారు.
ఢిల్లీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(CERC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటగిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 13న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రేపటి తోనే దరఖాస్తు గడువు ముగియనుంది.
ALSO READ: ITI LIMITED: శుభవార్త.. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్.. ఇంకెందుకు ఆలస్యం
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 7
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (ఇంజినీర్), రీసెర్చ్ ఆఫీసర్ (ఇంజినీర్), రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (ఇంజినీర్): 1 పోస్టు
రీసెర్చ్ ఆఫీసర్(ఇంజినీర్): 05 పోస్టులు
రీసెర్చ్ అసోసియేట్: 01 పోస్టు
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 13 (రేపటితోనే దరఖాస్తు గడువు ముగియనుంది)
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానిక దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డిప్యూటి చీఫ్ అడ్మినిస్ట్రేటర్, 8వ అంతస్తు, టవర్-బి, వరల్డ్ ట్రేడ్ సెంటర్, నౌరోజి నగర్, న్యూదిల్లీ-110029. చిరునామాకు దరఖాస్తులు పంపాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతం నిర్ధారించారు. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ ఉద్యోగానికి నెలకు రూ.94,000 – రూ.1,25,000, రీసెర్చ్ ఆఫీసర్‌కు రూ.64,000 – రూ.1,10,000, రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.45,000 – రూ.80,000 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.cercind.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 7
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 13
ALSO READ: RWF: టెన్త్ అర్హతతో 192 ఉద్యోగాలు.. ఏడాది పాటు స్టైఫండ్.. ఇప్పుడే దరఖాస్తు చేయండి..