E-Paper
Advertisement

అంజి మామకు బిగ్ షాక్.. రూ.23 లక్షలు పోయాయట!

అంజి మామకు బిగ్ షాక్.. రూ.23 లక్షలు పోయాయట!
Advertisement

Anji Mama:అంజి మామ…మై విలేజ్ షోలో ఎంత పాపులరో చెప్పక్కర్లేదు.ఇక ప్రస్తుతం మై విలేజ్ షో నుండి బయటికి వచ్చి సినిమాలలో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న అంజిమామ ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు, ఆర్థిక మోసాలు మరియు పడ్డ కష్టాల గురించి ఓపెన్ గా పంచుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈజీ మనీ కోసం ఆశపడి త్వరగా కోటీశ్వరులు అయిపోవాలనే ఆశతో ఎంతోమంది ఎలా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారో తన రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఆయన కళ్లకు చెప్పుకొచ్చాడు అంజిమామ.

దాదాపు  24 లక్షల రూపాయిల నష్టం 

Advertisement

ఫ్రెండ్స్ మరియు పరిచయస్తుల మాటలు నమ్మి బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ మరియు వివిధ రకాల ఫైనాన్షియల్ స్కీమ్‌లలో డబ్బులు పెట్టి దాదాపు 23 నుండి 24 లక్షల రూపాయిల వరకు నష్టపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంత పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న తర్వాత, ఆ అప్పులు తీర్చడానికి విదేశాలకు వెళ్లి రోజుకు 12 గంటలకు పైగా అష్టకష్టాలు పడాల్సి వచ్చిందని వాపోయాడు.

వ్యాపారమైనా అచ్చి వస్తుందని అనుకుని వాటర్ ప్లాంట్ పెట్టానని అది కూడా నష్టాల పాలైందని,ఇక మెడికల్ రిప్రజెంటేటివ్ (MR) గా పనిచేసినా ఎక్కడా సరైన సక్సెస్ దక్కలేదని చెప్పాడు అంజి మామ . ఇలా సరైన అవగాహన లేకుండా బిజినెస్ చేయడం, కొన్న ధరలకే వస్తువులను అమ్మేయడం వంటి పొరపాట్ల వల్ల భారీగా నష్టపోయినట్లు తెలిపాడు.

25,000 కోసం బెట్టింగ్ యాప్‌ ప్రమోట్ 

Advertisement

ఇక సోషల్ మీడియాలో ప్రమోషన్ల విషయానికి వస్తే, ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడానికి రూ. 25,000 ఆఫర్ రాగానే ఒప్పుకున్నానని, అయితే ఆ తర్వాత దాని వల్ల సామాన్యులు మోసపోతున్నారని గ్రహించి వెంటనే ఆ వీడియోలను డిలీట్ చేశానని స్పష్టం చేశారు.మొత్తంగా సులభంగా వచ్చే డబ్బు అసలు ఉండదని, కష్టపడి సంపాదిస్తేనే మనిషి దగ్గర నిలుస్తుందని తన మాటలలో ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు అంజిమామ.

also read :విజయ్ పక్కన త్రిష.. విమర్శలకు సంజనా గల్రాని దిమ్మతిరిగే ఆన్సర్!

ముందు ముందు ఎలాంటి పాత్రల్ని ఒడిసిపడతాడో

ఇక అంజి మామ సినిమాల విషయానికి వస్తే సుమంత్ ప్రభాస్ హీరోగా వచ్చిన మేమ్ ఫేమస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజి రీసెంట్ గా వచ్చిన ఓ సుకుమారి సినిమాలో కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెల్సిందే. చూడాలి మరి సినిమాలలో లక్ టెస్ట్ చేసుకుంటానని ఆశ పడుతున్న అంజిమామ ముందు ముందు ఎలాంటి పాత్రల్ని ఒడిసిపడతాడో !

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×