Ahsan Raza in India vs Sri Lanka: టీమిండియా వర్సెస్ శ్రీలంక (Team India vs. Sri Lanka) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ( India tour of Sri Lanka 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. గాలే ( Galle International Stadium, Galle) వేదికగా ఆగస్టు 15వ తేదీన శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 165 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో అదరగొట్టిన టీమిండియా… శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన దేవ్ దత్ పడిక్కల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
టీమిండియా వర్సెస్ శ్రీలంక (Team India vs. Sri Lanka) మధ్య జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఎన్నడు లేనివిధంగా పాకిస్తాన్ దేశానికి సంబంధించిన అంపైర్ బరిలోకి దిగాడు. పాకిస్తాన్ అంపైర్ అహసాన్ రజా ( Ahsan Raza )ను తొలి టెస్ట్ సందర్భంగా ఐసీసీ వాడుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అహసాన్ రజా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ కు పిచ్ అనుకూలంగా మారిన సంగతి తెలిసిందే. వేసిన ప్రతి బంతి అర్థం కాకుండా టర్న్ అయింది. అయినప్పటికీ పాకిస్తాన్ అంపైర్ అహసాన్ రజా సరైన నిర్ణయాలు తీసుకొని… ఇరు జట్లకు న్యాయం చేశాడు.
అలాగే మానవ్ సుతార్ ( Manav Suthar) బౌలింగ్ లో శ్రీలంకకు అనుకూలంగా మారే ఓ నిర్ణయాన్ని, పాకిస్తాన్ అంపైర్ అహసాన్ రజా ఇండియాకు అనుకూలంగా మలిచారు. మరో అంపైర్ ఉంటే మాత్రం అక్కడ శ్రీలంకకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేవాడు. కానీ సరైన అక్యురసీతో నిర్ణయం తీసుకున్నాడు పాకిస్తాన్ అంపైర్ అహసాన్ రజా. రెండో ఇన్నింగ్స్ లో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా అవలీలగా విజయం సాధించింది. పాకిస్తాన్ అంపైర్ అహసాన్ రజా నిర్ణయాలపై అటు మహమ్మద్ కైఫ్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్తానోడైనా సరే, ఇండియాను గెలిపించాడని మెచ్చుకున్నారు.
గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా బంపర్ విక్టరీ నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ లో 462 పరుగులు చేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్ లో 193 పరుగులు సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో లంక 284 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 206 పరుగులు చేసి ఓడిపోయింది.