E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

చేతిలోనే మినీ థియేటర్.. 9 స్పీకర్లు, 10,200mAh బ్యాటరీతో Lenovo కొత్త ట్యాబ్ వచ్చేసింది!

చేతిలోనే మినీ థియేటర్.. 9 స్పీకర్లు, 10,200mAh బ్యాటరీతో Lenovo కొత్త ట్యాబ్ వచ్చేసింది!
Advertisement

Lenovo Tab Plus Gen 2: లెనోవా సంస్థ భారత మార్కెట్లోకి సరికొత్త టాబ్లెట్ ‘లెనోవా ట్యాబ్ ప్లస్ జెన్ 2’ (Lenovo Tab Plus Gen 2)తో పాటు కొత్త ఎల్ఓక్యూ (LOQ) మానిటర్లను విడుదల చేసింది. వావ్ అనిపించే ఫీచర్లు, వపర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన ఈ డివైజ్‌ల వివరాలు మీకోసం.

సరికొత్త లెనోవా ట్యాబ్ ధరలు:

భారత్‌లో లెనోవా ట్యాబ్ ప్లస్ జెన్ 2 ప్రారంభ ధర రూ.35,999గా ఉంది. ఇది 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. అలాగే 256GB స్టోరేజ్ కలిగిన టాప్ ఎండ్ మోడల్ ధరను రూ.38,999గా నిర్ణయించారు. ఇది సెలెస్టియల్ వైట్ రంగులో లభిస్తుంది. దీన్ని లెనోవా అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

అదిరిపోయే సౌండ్ క్వాలిటీ:

Advertisement

ఈ ట్యాబ్‌లో 12.1 ఇంచుల పెద్ద డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 2.5K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. దీనివల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా, విజువల్స్ అద్భుతంగా కనిపిస్తాయి. ముఖ్యంగా సినిమా ప్రియుల కోసం ఇందులో JBL అందించిన 9 స్పీకర్ల సిస్టమ్‌ను అమర్చారు.

Also Read: మీరు వాడుతున్న పవర్ బ్యాంక్ సేఫేనా? ల్యాబ్ టెస్టులో సక్సెస్‌ఫుల్‌గా పాసైన ఆ 5 మోడల్స్ ఇవే!

Advertisement

డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో వచ్చే ఈ స్పీకర్లు థియేటర్ లాంటి సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి. మన ఫోన్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి దీన్ని ఒక స్పీకర్‌లా కూడా వాడుకోవచ్చు. ఇందులో ఉండే 360 డిగ్రీల కిక్‌స్టాండ్ వల్ల ట్యాబ్‌ను మనకు నచ్చిన కోణంలో తిప్పుకుని వాడుకునే వీలుంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

ఈ ట్యాబ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే ఈ ట్యాబ్ కోసం ఆండ్రాయిడ్ 18 వరకు ఓఎస్ అప్‌గ్రేడ్స్, 2030 వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అలాగే ఇందులో 10,200mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక ఫొటోల కోసం వెనుక వైపు 13MP కెమెరా, సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

గేమర్స్ కోసం సరికొత్త మానిటర్లు:

ట్యాబ్‌తో పాటు లెనోవా తమ LOQ మానిటర్ సిరీస్‌ను కూడా లాంచ్ చేసింది. వీటి ధరలు రూ.9,799 నుండి స్టార్ట్ అవుతాయి. ఈ సిరీస్‌లో LOQ 24-10, LOQ 27-10, LOQ 27Q-10 మోడల్స్ ఉన్నాయి.  అలాగే దీనిలో ప్రీమియం మోడల్ అయిన LOQ 27Q-10 మానిటర్ 180Hz రిఫ్రెష్ రేట్‌తో గేమర్స్‌కు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇది ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ లాంటి గేమింగ్ కన్సోల్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది.

Also Read: కేక పుట్టించే కెమెరా, భారీ బ్యాటరీ.. రూ.30,000 లోపు దొరికే బెస్ట్ ఫోన్లు ఇవే!

Related News

Samsung నుంచి సరికొత్త AI స్మార్ట్ గ్లాసెస్.. ఎలా పనిచేస్తాయో లీక్ చేసిన కంపానియన్ యాప్!

ఇక DSLR పని ఖతం.. ఏకంగా 200 మెగాపిక్సల్ కెమెరాతో వస్తోన్న వివో కొత్త ఫోన్!

వైర్లతో పనిలేదు.. అమెజాన్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్!

మీరు వాడుతున్న పవర్ బ్యాంక్ సేఫేనా? ల్యాబ్ టెస్టులో సక్సెస్‌ఫుల్‌గా పాసైన ఆ 5 మోడల్స్ ఇవే!

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ కెటిల్స్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!

దొంగలు, చోరీలకు చెక్ పెట్టాలా? వైర్డ్ vs వైర్‌లెస్.. ఏ CCTV పవర్ఫుల్?

ఇల్లే ఇక సినిమా హాల్.. బేస్ అంటే ఇదబ్బా!

Big Stories

×