E-Paper
Advertisement

తండ్రి దొంగిలించిన డబ్బు కోసం సౌత్ ఆఫ్రికాకు… కోట్ల డబ్బు కోసం అంతర్జాతీయ మాఫియాతో పోరాటం

తండ్రి దొంగిలించిన డబ్బు కోసం సౌత్ ఆఫ్రికాకు… కోట్ల డబ్బు కోసం అంతర్జాతీయ మాఫియాతో పోరాటం
Advertisement

Crime Thriller Series: ఒక ప్లంబర్ జీవితంలోకి ఒక్కసారిగా కోట్ల రూపాయల విలువైన మాఫియా డబ్బు వచ్చి పడితే ? అది తనది కాదని, తన తండ్రి దొంగిలించిన డబ్బని తెలిస్తే ? ఆ డబ్బు కోసం అంతర్జాతీయ క్రిమినల్స్ తన కుటుంబం వెంట పడితే పరిస్థితి ఎలా ఉంటుంది ? మొదటి సీజన్‌లో కుటుంబాన్ని కాపాడుకున్న జోకు ఇప్పుడు అంతకంటే పెద్ద ముప్పు ఎదురైతే ? అమెరికా నుంచి సౌత్ ఆఫ్రికాకు కథను తీసుకెళ్లి, క్రైమ్, యాక్షన్‌తో పాటు డార్క్ కామెడీని జోడించిన సిరీస్ ‘Average Joe Season 2’ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. మరి ఈసారి జో కేప్ టౌన్ ఎందుకు వెళ్లాడు? అక్కడ అతనికి ఎదురైన క్రైమ్ ప్రపంచం ఏంటి? అసలు ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనేది చూద్దాం.

కథలోకి వెళ్తే…

జో వాషింగ్టన్ పిట్స్‌బర్గ్‌లో ప్లంబర్‌ గా పని చేస్తుంటాడు. ఫ్యామిలీ మ్యాన్ అయిన అతని జీవితంలో పెద్దగా థ్రిల్స్ ఉండవు. కానీ తండ్రి మరణించిన తర్వాత బయటపడిన ఓ నిజం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తన తండ్రి రష్యన్ మాఫియాకు చెందిన దాదాపు 10 మిలియన్ డాలర్ల డబ్బుతో పాటు ఓ లగ్జరీ కారును దొంగిలించినట్టు జోకు తెలుస్తుంది. తండ్రి దాచిన ఆ డబ్బు ఎక్కడుందో తనకు తెలుసని మాఫియా భావించడంతో అసలు సమస్య మొదలవుతుంది. జో కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయడంతో, తనకు సంబంధం లేని నేరానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

Advertisement

మొదటి సీజన్‌లో ఈ ముప్పు నుంచి కుటుంబాన్ని కాపాడుకున్న జో.. రెండో సీజన్‌లో అదే పాత రహస్యం మరింత పెద్ద సమస్యగా మారడంతో మరోసారి రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఈసారి అతని ప్రయాణం అమెరికాను దాటి సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ వరకు వెళ్తుంది. తండ్రి దాచిన డబ్బులో మిగిలిన భాగం కోసం జో, అతని స్నేహితులు అక్కడికి చేరుకుంటారు. కానీ కొత్త ప్రాంతం కావడంతో పరిస్థితులు మరింత కష్టంగా మారతాయి. స్థానిక క్రైమ్ నెట్‌వర్క్, అంతర్జాతీయ మాఫియా మధ్య జో చిక్కుకుంటాడు. అక్కడ అతనికి ఎదురయ్యే కీలక వ్యక్తుల్లో సిపో అనే క్రైమ్ బాస్ కూడా ఉంటాడు.

డబ్బు కోసం మొదలైన వేట క్రమంగా పాత లెక్కలు, కుటుంబ రహస్యాలు, మాఫియా ప్రతీకారాలతో ముడిపడుతుంది. తన తండ్రి అసలు ఎందుకు అంత పెద్ద మొత్తాన్ని దొంగిలించాడు ? డబ్బు మొత్తం ఎక్కడుంది ? జోను మాఫియా వదిలేస్తుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సిరీస్ ను పూర్తిగా చూడాల్సిందే. ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య జో ఎదుర్కొనే విచిత్రమైన సందర్భాలతో డార్క్ కామెడీ కూడా కథలో భాగం అవుతుంది. కేప్ టౌన్ బ్యాక్‌డ్రాప్, కొత్త క్రైమ్ క్యారెక్టర్లు, యాక్షన్, ఛేజింగ్ సీన్స్‌తో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది.

ఓటీటీలో ఎక్కడ చూడాలి ?

Advertisement

‘యావరేజ్ జో సీజన్ 2’ ఆగస్టు 19 నుంచి Paramount+ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి రోజు రెండు ఎపిసోడ్లు విడుదల కాగా, ఆ తర్వాత ప్రతి బుధవారం కొత్త ఎపిసోడ్ రానుంది. మొత్తానికి సాధారణ ప్లంబర్‌ను మాఫియా ప్రపంచంలోకి లాగిన కథ… ఈసారి ఏకంగా కేప్ టౌన్ వరకు వెళ్లింది. డార్క్ కామెడీ, యాక్షన్, క్రైమ్, మాఫియా థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఈ సీజన్ ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే నిరాశను కలిగించే విషయం ఏమిటంటే… ఈ సిరీస్ తెలుగులో లేదు.

Read Also: కూతురి స్విమ్మింగ్ కోచ్ పై తల్లికి అలాంటి కోరిక… చివరికి ఏం జరిగిందో చూస్తే బుర్రపాడు

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×