నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ మహారత్న సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నిరుద్యోగులకు ముఖ్యంగా సాంకేతిక రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 668 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఇందులో డిప్లొమా ట్రెయినీ, జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ, జూనియర్ టెక్నీషియన్ ట్రెయినీ వంటి కీలక విభాగాలు ఉన్నాయి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 668
పోస్టుల వివరాలు: డిప్లొమా ట్రెయినీ విభాగంలో ఎలక్ట్రికల్, సివిల్, సర్వే విభాగాలు ఉన్నాయి. అలాగే జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ విభాగంలో హెచ్‌ఆర్, ఎఫ్ & ఏ వంటి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు భర్తీ కానున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు జూనియర్ టెక్నీషియన్ ట్రైయినీ (సర్వే) పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ పవర్ గ్రిడ్ యూనిట్లలో పని చేయాల్సి ఉంటుంది.
విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. విద్యాార్హతలతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు: అభ్యర్థుల వయోపరిమితి 2026 మే 11వ తేదీ నాటికి 27 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు శిక్షణలో ఉంటారు. ఈ శిక్షణ కాలంలో పోస్టును బట్టి నెలకు రూ.21,000 నుండి రూ.24,000 వరకు స్టైపెండ్ అందిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులను రెగ్యులర్ ఉద్యోగులుగా నియమిస్తారు. అప్పుడు సంస్థ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి జీతభత్యాలు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఉద్యోగ భద్రతతో పాటు మంచి కెరీర్ వృద్ధి ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుంది. అభ్యర్థులకు మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఉంటుంది. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి పోస్టు స్వభావాన్ని బట్టి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తులు 2026 ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభమవుతాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 11గా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు గడువు ముగిసేలోపు పవర్ గ్రిడ్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.powergrid.in/
ALSO READ: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. రూ.1,80,000 వరకు జీతం, APPLY NOW