Nizamabad Politics: కాంగ్రెస్ పార్టీకి కుటుంబం మొదటి నుంచి అంకిత భావంతో పనిచేస్తూ వచ్చింది ధర్మపురి శ్రీనివాస్ కుటుంబం. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి చవ్చిన రెండు సార్లు డీఎస్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మారిన సమీకరణలతో గులాబీ కండువా కుప్పుకున్నా, ఆ పార్టీలో ఇమడలేకపోయారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ధర్మపురి కుటుంబం గురించి చర్చ అంటారా? ప్రస్తుతం డీఎస్ వారుసులు ఇద్దరిలో ఒకరైన ధర్మపురి సంజయ్ కాంగ్రెస్‌లో, ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీలో కొనసాగుతున్నారు. ఆ క్రమంలో నిజామాబాద్‌కే చెందిన ఆ ఇద్దరు బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ .. పీక్ స్టేజ్‌కి చేరడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ కుటుంబానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌తో అవినాభావ సంబంధం ఉందని చెప్పుకుంటారు. వారి కుటుంబానికి మొదటి నుంచి అండగా నిలుస్తూ వస్తూ, బలమైన ఓటు బ్యాంకుగా తయారైంది మున్నూరు కాపు సామాజిక వర్గం. వన్స్ వారు అనుకుంటే వార్ వన్ సైడ్ అన్నట్లు ఓకే సారి గంప గుత్తా ఓట్లు వేస్తారు. అలా ఇప్పటి వరకు దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ చిన్న కొడుకు అరవింద్‌ను రెండు సార్లు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించారు. గెలిచిన 2 సార్లు అరవింద్ మున్నూరు కాపు వర్గీయలు అండతోనే గెలిచారంటారు. అయితే రెండు సార్లు గెలిచిన ఇప్పుడు మాత్రం ఎంపీ అరవింద్‌కి వచ్చే ఎన్నికల్లో గడ్డు కాలం తప్పదన్న టాక్ నిజామాబాద్ పార్టమెంట్ సెగ్మెంట్లో వినిపిస్తోంది. కారణం ధర్మపురి కుటుంబంలో మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మపురి సంజయ్ పార్టీలో యక్టివ్ కావడం, మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి కాంగ్రెస్‌కు దక్కేలా చేయడంలో కీ రోల్ పోషించడంతో.. సంజయ్‌కు పార్టీలో మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారంట.
Also Read: Viral Video: చెప్పు చూపిస్తూ.. బూతులతో రెచ్చిపోయిన మహిళ, ఓపిక నశించి.. అతడు ఏం చేశాడంటే?
ఇప్పటికే ధర్మపురి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్లస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏ పదవి లేకుండానే విపక్షాలకు ధీటైన సమాధానం ఇచ్చే సంజయ్‌ని ఉన్నత పదవిలో కూర్చో పెడితే జిల్లాల్లో కాంగ్రెస్‌కు అదనపు బలం చేకూరుతుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోందంట. ఆయన జిల్లా లో 50 శాతం కి పైగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఏకతాటిపైకి తీసుకొచ్చి, పార్టీకి అండగా నిలుపుతారని కాంగ్రెస్ అధిష్టానం లెక్కలు వేసుకుంటుందంట. ధర్మపురి శ్రీనివాస్ మరణించిన సమయంలో పరామర్శకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ధర్మపురి సంజయ్ కి రాజకీయంగా అండగా ఉంటానని, మంచి స్థానంలో ఉంచుతానని హామీ ఇచ్చారు. ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు సంజయ్ ను కలుపుకుని పోతూ, ఒక మంచి స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపు సంజయ్‌కి ఒక స్థానం ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నారంట. అప్పడు ఆయనజిల్లా మొత్తం తిరుగుతూ, పార్టీ గెలుపు కోసం ముందుంటారని, అదే జరిగితే బీజేపీ, బీ ఆర్ఎస్‌కి ధీటైన సమాధానం చెప్పే మునూరు కాపు నేతగా ఫోకస్ అయ్యే అవకాశముందంటున్నారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ధర్మపురి వారసుల మధ్య పోరు ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఎంపీ అరవింద్ , తండ్రి పేరు డీఎస్ తన పేరని చెప్పుకునే ధర్మపురి సంజయ్ మధ్య వచ్చే ఎన్నికల్లో రసవత్తరమైన రాజకీయపోరు ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇప్పటికీ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న దివంగత డీఎస్ శిష్యులు, అభిమానులు సంజయ్ రాజకీయ భవిష్యత్ కు ఏ విధంగా బాటలు వేస్తారనేది చూడాలి.
Story By Apparao, Big Tv
Also Read: South Central Railway: రైల్వేలో 2801 ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?