E-Paper
Advertisement

Jobs in Indian Railways: గ్రూప్స్ ఎగ్జామ్స్ బాగా రాయలేదా..? అయితే నోవర్రీ.. మీ కోసమే రైల్వేలో 32,438 ఉద్యోగాలు..

Jobs in Indian Railways: గ్రూప్స్ ఎగ్జామ్స్ బాగా రాయలేదా..? అయితే నోవర్రీ.. మీ కోసమే రైల్వేలో 32,438 ఉద్యోగాలు..
Advertisement

Jobs in Indian Railways: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త. ఎన్నో రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న గ్రూప్-డి నోటిఫికేషన్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 32000 వేల గ్రూప్-డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలుబడింది.

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో గ్రూప్‌–డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 23 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం రావడానికి మళ్లీ చాలా సమయం పడొచ్చు.. కనుక ఈ సారే జాబ్ కి అప్లై చేసుకొని కాస్త కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ప్రపిరేషన్ స్టార్ట్ చేయండి. ఉద్యోగం సాధించండి.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 32,438

ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పాయింట్స్ మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకోషెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఉద్యోగాలున్నాయి.

Advertisement

ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకన్సీ ఉన్నాయి.

విద్యార్హత: టెన్త్ క్లాస్, సంబంధిత విభాగంలో ఐటీఐ పాసై ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కల్గి ఉండాలి.

వయస్సు: 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 23

దరఖాస్తు ముగింపు తేది: 2025 ఫిబ్రవరి 22

సంబంధించిన అఫీషియల్ వెబ్ సైట్: https://indianrailways.gov.in

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

మన సికింద్రాబాద్ జోన్‌లో 1642 ఉద్యోగాలున్నాయి

ముఖ్యమైనవి:

దరఖాస్తు ప్రారంభ తేది: జనవరి 23

దరఖాస్తుకు ముగింపు తేది: ఫిబ్రవరి 22

దేశ వ్యాప్తంగా మొత్తం ఉద్యోగాలు: 32,438

వయస్సు: 18 నుంచి 36  ఏళ్ల మధ్య ఉండాలి.

Also Read: Cement Corporation of India jobs: టెన్త్ పాసైతే చాలు.. నెలకు రూ.40,000.. ఇప్పుడే అప్లై చేసుకోండి..!

ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి నుంచి ప్రణాళిక ప్రకారం చదువుకుంటే గ్రూప్-డి ఉద్యోగాన్ని సునాయాసంగా సాధించవచ్చు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలు బాగ రాయలేని వారికి ఇది గోల్డెన్ అపార్చునిటీగా చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టండి మీ ప్రేపరేషన్.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×