New Orleans Attack ISIS | అమెరికాలోని న్యూ ఓర్లియన్స్ నగరంలో న్యూ ఇయర్ వేడుకల వేళ ఒక వ్యక్తి పికప్ ట్రక్కుతో జనం మీదకు దూసొకొచ్చాడు. ఈ దాడిలో అక్కడ నిలబడి ఉన్న జనం చచ్చిపోయారు, ఆస్తులు ధ్వంసమయ్యాయి.. ఆ తరువాత కూడా ఆ వ్యక్తి తుపాకీతో జనంపై కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ నిలబడి ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని కాల్చి చంపారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనలో మొత్తం 15 మంది చనిపోయారు. అయితే ఆ దుండగుడు ఎందుకు కారుతో, తుపాకీతో దాడి చేశాడు. అతనెవరు అనే విషయాలపై పోలీసులు విచారణ చేశారు. షాకింగ్ విషయమేమిటంటే అతను గతంలో చాలా కాలం పాటు అమెరికా సైన్యంలో సైనికుడిగా పనిచేశాడు. అతని పేరు షంసుద్దీన్ జబ్బార్. అతనికి ఉగ్రవాద సంస్థ ఐసిసి (ఇస్లామిక్ స్టేట్) తో సంబంధాలున్నాయని ఎఫ్‌బిఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
షంసుద్దీన్ జబ్బార్ ఎవరు?
న్యూ ఓర్లియన్స్ అటాక్ ప్రధాన నిందితుడు షంసుద్దీన్ జబ్బార్ (42).. ఒక అమెరికా పౌరుడే. అయితే అతను 2007 నుంచి 2020 వరకు అమెరికన్ ఆర్మీ లో సేవలందించాడు. 2007 నుంచి 2015 వరకు హ్యూమన్ రిసోర్స్ స్పెషలిస్ట్, ఐటి స్పెషలిస్ట్ గా పనిచేశారు. ఆ తరువాత 2020 వరకు ఆర్మీ రిజర్వ్ లో ఉన్నాడు.
షుంసుద్దీన్ జబ్బార్ అమెరికా ఆర్మీలో ఫిబ్రవరి 2009 నుంచి 2010 వరకు ఆఫ్ఘనిస్తాన్ మిషన్ లో ఉన్నాడు. 2020లో అతని సర్వీస్ ముగిసే సమయానికి స్టాఫ్ సార్‌జెంట్ ర్యాంక్ ఉంది. పైగా రిటైర్మెంట్ సమయంలో ఆర్మీ అతనికి అన్ని గౌరవ మర్యాదలు చేసింది. కానీ షంసుద్దీన్ జబ్బార పేరు మీద గతంలో క్రిమినల్ రికార్డ్ కూడా ఉంది. 2002లో అతను ఒక దొంగతం కేసులో కొంత కాలం జైల్లో ఉన్నాడు. ఆ తరువాత 2005లో లైసెన్స్ లేకుండా కారు నడిపాడు.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
నిందితుడు షంసుద్దీన్ జబ్బార్ సోదరుడు అబ్దుల్ జబ్బార్ ని పోలీసులు విచారణ చేశారు. కానీ షంసుద్దీన్ చాలా మంచి వ్యక్తి అందరితో గౌరవంగా, ఆప్యాయంగా వ్యవహరించే వాడని అబ్దుల్ జబ్బార్ తెలిపాడు. ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక షంసుద్దీన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఉద్యోగం చేశాడు. కానీ కంపెనీ దివాలా తీయడంతో అతనికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. పైగా అతని రెండో భార్య 2022లో అతడి నుంచి విడాకులు తీసుకుంది.
ఈ క్రమంలో 42 ఏళ్ల షంసుద్దీన్ జనవరి 1, 2025 ఉదయం 3 గంటలకు న్యూ ఓర్లియన్స్ ప్రంతంలో ఒక అద్దె ట్రక్కు తీసుకొని న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న సామాన్య జనంపైకి దూసుకెళ్లాడు. పోలీస్ కాల్పుల్లో షంసుద్దీన్ చనిపోయాక.. అతడి కారుని పరిశీలించగా.. అందులో నుంచి ఐసిస్ జెండాలు కనిపించాయని.. చనిపోవడానికి నాలుగు గంటల ముందు షంసుద్దీన్ సోషల్ మీడియాలో వీడియోలు కూడా పోస్ట్ చేసినట్లు ఎఫ్‌బిఐ అధికారాలు తెలిపారు. దీంతో షంసుద్దీన్ వెనుక ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు.