SSKAL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బీఎడ్, మాస్టర్స్ డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఏపీ, అన్నమయ్య జిల్లాలోని కలికిరి సైనిక్ స్కూల్ (ఎస్ఎస్‌కేఏఎల్) లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నమయ్య జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థుకుల మంచి వేతనం కూడా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని సైనిక్ స్కూల్ కలికిరి(SSKAL) ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. మే 9వ తేదీ వరకు అభ్యర్థులు ఆఫ్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.
పోస్టుల సంఖ్య: 2
కలికిరి సైనిక స్కూల్ లో పీజీటీ (ఇంగ్లిష్), ఆర్ట్ కమ్ క్రాప్ట్ టీచర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
పీజీటీ (ఇంగ్లిష్) : 1 పోస్టు
ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్ : 1 పోస్టు
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 9
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఎడ్, మాస్టర్స్ డిగ్రీ(ఫైన్ ఆర్ట్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. పీజీటీకి 21 – 40 ఏళ్లు, ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్‌కు 21 – 35 ఏళ్లు మద్య వయస్సు ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. నెలకు ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్‌కు రూ.58,819, పీజీటీ పోస్టుకు రూ.62,356 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉన్న వారు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
చిరునామా: అప్లికేషన్ ను ది ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్-517234 చిరునామాకి పంపాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://sskal.ac.in/
అర్హత ఉండి ఆసక్తి గల వారందరూ ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్‌కు రూ.58,819, పీజీటీ పోస్టుకు రూ.62,356 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉన్న వారు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ముఖ్య సమాచారం:
పోస్టుల సంఖ్య: 2
చివరి తేది: మే 9
Also Read: Jobs: డిగ్రీ అర్హతతో మన ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.30,000.. రేపే లాస్ట్ డేట్