BigTV English

Priyadarshi: నాకు చిన్న సినిమాలు వద్దు.. ఇన్ హీరో షాకింగ్ స్టేట్మెంట్..

Priyadarshi: నాకు చిన్న సినిమాలు వద్దు.. ఇన్ హీరో షాకింగ్ స్టేట్మెంట్..

Priyadarshi: తెలుగు సినిమా పరిశ్రమలో, హాస్యనటుడుగా కెరియర్ ను ప్రారంభించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారు తక్కువ అని చెప్పొచ్చు. అలా వచ్చిన వారిలో ప్రియదర్శి ఒకరు. హీరోకి సపోర్ట్ చేసే ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఎక్కువగా ప్రియదర్శి కనిపిస్తారు. విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాలో కౌశిక్ పాత్ర ఎప్పటికీ గుర్తుంటుంది. తరువాత జాతి రత్నాలతో హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సహనటులతో కలిసి చేసే కామెడీ సూపర్ గా నవ్విస్తోంది. తాజాగా ఆయన మరో మూవీతో కడుపుబ్బ నవ్వించడానికి సిద్ధమయ్యారు. ఆ సినిమా పేరు సారంగపాణి జాతకం. కామెడీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 25న రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, ప్రియదర్శి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, పెద్ద సినిమాలలో అయన క్యారెక్టర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుంది. అసలు ప్రియదర్శి దేని గురించి, ఏ సినిమా గురించి అన్నది తెలుసుకుందాం..


పెద్ద సినిమా అయితే చాలు ..

సారంగపాణి జాతకం అంటూ ప్రియదర్శి సోలో హీరోగా మన ముందుకు రానున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ప్రియదర్శి మాట్లాడుతూ.. ఈ కథలో, ఎక్కువగా జాతకాలు నమ్మే కుర్రాడు ఎలా ఉంటాడు. సరైన నిర్ణయం తీసుకోకుండా కన్ఫ్యూజన్లో ఉంటే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడు అనేది సినిమాలో చూడొచ్చు. మీరు పెద్ద సినిమాలలో క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి, ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘మీరు మాట్లాడేది గేమ్ చేంజెస్ సినిమాలో నా క్యారెక్టర్ గురించే అయితే.. నేను ఆ సినిమా బలగం సినిమా కన్నా ముందే ఒప్పుకున్నాను. నేను కావాలని ఆ సినిమాలో దిల్ రాజుని అడిగి క్యారెక్టర్ వేయించుకున్నాను. శంకర్ గారితో, రామ్ చరణ్ గారితో పని చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి పెద్ద పెద్ద వారితో పనిచేయలనే కోరికతో నేను ఆ సినిమాకి క్యారెక్టర్ కోసం దిల్ రాజు దగ్గరికి వెళ్లాను. సినిమా పెద్దదైన అందులో చిన్న పాత్ర చాలు. నాకు నా క్యారెక్టర్ ముఖ్యం అని ప్రియదర్శి తెలిపారు.


అయన కామెడీ స్టైల్, సూపర్..

సారంగపాణి జాతకం సినిమాకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈయన చేసిన సినిమాలన్నిటిలో కామెడీతో కడుపుబ్బ నవ్వించారు. ఇప్పుడు మరలా మరోసారి ప్రియదర్శితో, నవ్వించడానికి రెడీ అయ్యారు. అష్టా చమ్మా, జెంటిల్మెన్, సమ్మోహనం వంటి సినిమాలు ఇంద్రగంటి కామెడీ స్టైల్ కి నిదర్శనం. ఈసారి సారంగపాణి జాతకం సినిమాతో నవ్వుల రైడ్ కు ప్రేక్షకులను సిద్ధమవ్వాలని, ట్రైలర్ ద్వారా మనకి తెలిపారు. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సినిమా రిలీజ్ తర్వాత ప్రియదర్శి కి మోహన్ కృష్ణకు, మంచి సక్సెస్ ని అందించాలని కోరుకుందాం.

Aditi Rao Hydari : నా వంట మనిషి… అయ్యో కట్టుకున్న భర్తను అంత మాట అనేసిందేంటి భయ్యా.. .

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×