BigTV English

IOCL jobs: టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హతతో జాబ్స్.. ఈ జాబ్ గిట్ల వస్తే రూ.78,000 జీతం..

IOCL jobs: టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హతతో జాబ్స్.. ఈ జాబ్ గిట్ల వస్తే రూ.78,000 జీతం..

IOCL jobs: టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ ఆయల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో మార్కెటింగ్ డివిజన్ పలు ప్రదేశాల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.


నిరుద్యోగులకు సువర్ణవకాశం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) మార్కెటింగ్ డివిజన్‌లో వివిధ ప్రదేశాల్లో ఖాళీగా జూనియర్ ఆపరేటర్ గ్రేడ్, జూనియర్ అటెండెంట్ గ్రేడ్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 246


ఇందులో పలు రకాలు ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. జూనియర్ ఆపరేటర్ గ్రేడ్-1, జూనియర్ అటెండెంట్ గ్రేడ్-1, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్-3 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఖాళీల వారీగా…

జూనియర్ ఆపరేటర్ గ్రేడ్-1: 215 ఉద్యోగాలు

జూనియర్ ఆటెండెంట్ గ్రేడ్-1: 23 ఉద్యోగాలు

జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్-3: 08 ఉద్యోగాలు

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 3

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 23

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. అయితే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణిలోకి తీసుకుంటారు.

వయస్సు: 2025 జనవరి 31 నాటికి 18 నుంచి 26 ఏళ్ల వయస్సు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. నెలకు జూనియర్‌ ఆపరేటర్‌, జూనియర్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-1 పోస్టులకు రూ.23,000 – రూ.78,000, జూనియర్ బిజినెస్‌ అసిస్టెంట్ గ్రేడ్‌-3 పోస్టుకు రూ.25,000 – రూ.1,05,000 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.

అఫీషియల్ నోటిఫికేషన్: https://iocl.com/latest-job-opening

అర్హత ఉన్న అభ్యర్థులు మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశమనే చెప్పవచ్చు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం కూడా కల్పిస్తారు. నెలకు జూనియర్‌ ఆపరేటర్‌, జూనియర్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-1 పోస్టులకు రూ.23,000 – రూ.78,000, జూనియర్ బిజినెస్‌ అసిస్టెంట్ గ్రేడ్‌-3 పోస్టుకు రూ.25,000 – రూ.1,05,000 జీతం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉన్న అభ్యర్థలందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ముఖ్యమైనవి:

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 3

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 23

జీతం: ఉద్యోగాన్ని బట్టి రూ.23,000 నుంచి రూ.1,05,000 ఉంటుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×