BigTV English

RC16: పాత పద్దతిలో చరణ్ షూటింగ్.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ బుచ్చిబాబు

RC16: పాత పద్దతిలో చరణ్ షూటింగ్.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ బుచ్చిబాబు

RC16: ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్జి లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆయన ఎలాంటి సినిమా చేస్తున్నా.. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చరణ్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసారు.  ఎన్నో అంచనాల మధ్య జనవరి 10 న రిలీజ్ అయిన ఈ సినిమా  భారీ పరాజయాన్ని అందుకుంది.


శంకర్ నుంచి రావాల్సిన సినిమా కాదని కొద్నారు, నెగిటివ్ ట్రోల్స్ వలన ప్లాప్ అయ్యిందని కొందరు.. అసలు ఇప్పుడు రావాల్సిన సినిమా కాదని మరికొందరు.. ఇలా రకరకాల కారణాల వలన గేమ్ ఛేంజర్ పరాజయాన్ని అందుకుంది. ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమా చివరకు నిర్మాతకు నష్టాన్ని మిగిల్చింది. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం RC16. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది.

ఈ కాంబోపై కూడా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబో ఎంతటి  సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వారి వారసులు ఇద్దరు ఈ సినిమాలో నటిస్తుండడంతో ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా మారింది. అందులోనూ ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా మారి, మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు ను అందుకున్నాడు బుచ్చిబాబు.  ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కు కథ చెప్పి.. ఆ సినిమాను తెరకెక్కించడం  కోసం ఎదురుచూశాడు.  అది అవ్వదు అని తెలిసి.. చరణ్ కోసం ఒక కొత్త కథను రాసి.. ఒప్పించి.. ఎట్టకేలకు సినిమాను  పట్టాలెక్కించాడు.


Dil Raju: బడ్జెట్ కాదు కథ ముఖ్యం.. తప్పు తెలుసుకున్న హార్ట్ కింగ్.. ఇంకోసారి అలా చేయనంటూ

ఇక  RC16 కోసం చరణ్ మరోసారి మాస్ లుక్ మేకోవర్ ను చేస్తున్నాడు. గుబురు గడ్డం.. లాంగ్ హెయిర్.. చెవికి పోగు. చరణ్ లుక్ చూస్తుంటేనే  సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా గురించి వచ్చిన ఏ వార్త అయినా ఇట్టే వైరల్ గ మారిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పెద్ది అని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇదంతా పక్కన  పెడితే తాజాగా  RC16 గురించిన ఒక వార్త  నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్ గా రత్నవేలు పనిచేస్తున్న విషయం తెల్సిందే. రోబో, దేవర, రంగస్థలం లాంటి హిట్ సినిమాలకు పనిచేసిన ఆయన ఇప్పుడు RC16 కు వర్క్ చేస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రత్నవేలు RC16 కోసం పాత పద్ధతిలో షూటింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగి అంతా సిజిటల్ అయ్యింది. కానీ, ఒకప్పుడు షూటింగ్ అంటే చాలా ప్రాసెస్ ఉండేది. కెమెరాతో షూట్ చేసిందంతా ఒక నెగిటివ్ రీల్ లో ఉంచేవారు. వాటిని ఎడిట్ చేసి సినిమాగా మార్చేవారు.

ఇక ఇప్పుడు ఇదే నెగిటివ్  రీల్ పద్దతిని RC16 కోసం వాడుతున్నారట. సినిమా మొత్తం కాదు కానీ.. ఒక పర్టిక్యులర్ సీన్ కోసం ఈ పద్దతిని ఉపయోగిస్తున్నట్లు రత్నవేలు చెప్పాడు. దీంతో  ఆ సీన్ కచ్చితంగా సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇక ఈ వార్త వినడంతో మెగా ఫ్యాన్స్.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ బుచ్చిబాబు.. మా అన్నతో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి  ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×