This Week Movies : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది జాతకాన్ని ఒక శుక్రవారం మార్చేస్తుంది అంటారు. కరెక్ట్ గా ఒక శుక్రవారం వస్తే చాలు చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్ధంగా ఉంటాయి. అయితే కొన్ని శుక్రవారాలు మాత్రం అసలైన సినిమాలు లేకుండా కూడా పోయిన రోజులు ఉన్నాయి. అవి అరుదుగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ శుక్రవారం అలాంటిదే, ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమాలు చాలామంది సినిమా ప్రేమికులకు కూడా తెలియవు. ముఖ్యంగా ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలలో దేనికి సరైన బజ్ లేకుండా పోయింది.
అయితే ఈ ఉన్న 5 సినిమాల్లో ఏది బెస్ట్.?
ఏ సినిమాను ఎందుకు చూడాలి.?
అలాగే ఈ 5 సినిమాల్లో ఫస్ట్ చూడాల్సిన సినిమా ఏది..? లాస్ట్ చూడాల్సిన సినిమా ఏది..?
అనేది ఇప్పుడు చూద్ధాం…
గాంధీ తాత చెట్టు
ఈ వారం రిలీజ్ అవుతున్న 5 సినిమాలో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన సినిమా గాంధీ తాత చెట్టు. సుకుమార్ కూతురు సుకృతి వేణి కీలక పాత్ర చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో సినిమా బండి, కీడా కోలా సినిమాలతో అద్భుతమైన గుర్తింపు సాధించుకున్న రాగ మయూర్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ టీజర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా అంతా కూడా ఒక చెట్టుతో మనిషికి ఉండే ఎమోషన్ ను బేస్ చేసుకుని తీసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ శుక్రవారం విడుదలవుతున్న సినిమాలలో కొద్దో గొప్పో గాంధీ తాత చెట్టు సినిమా పైన అంచనాలు ఉన్నాయి. పైగా డైరెక్టర్ సుకుమార్‌తో ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఈ సినిమాకి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించింది.
డియర్ కృష్ణ
ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలో రెండో మూవీగా చెప్పుకొదగ్గది అంటే… డియర్ కృష్ణ. ప్రేమలు ఫేం మమితా బైజు వల్ల ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీని కూడా ఓ సారి చూడొచ్చు. ఇది జనవరి 24న విడుదల చేయనున్నారు.
ఐడెంటిటీ
ఈ ఐడెంటిటీ మూవీకి మూడో ర్యాంక్ ఇవ్వొచ్చు. తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలు చూడటం కూడా మొదలుపెట్టారు. అయినా కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలను తెలుగు డబ్బింగ్ చేసి కొంతమంది నిర్మాతలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన – దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మించారు. మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన ఈ చిత్రం జనవరి 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళంలో ఈ సినిమా రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసింది. శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు
హత్య
ఇక హత్య మూవీ ప్రయారిటీ లిస్ట్‌లో 4వ స్థానంలో ఉంది. ముందుగా ఈ సినిమాకు మైనస్ అంటే.. టైటిల్. హత్య అని టైటిల్ పెట్టడంతోనే ఓ వర్గం ప్రేక్షకులు సాధరాణంగా దూరం అవుతారు. అలాగే… ఇటీవల వచ్చిన సన్సార్ రిపోర్ట్ లో ఈ సినిమా నుంచి 15 నిమిషాలు రిమూవ్ చేశారు అని తెలిసింది. దీంతో ఈ సినిమాకు కాస్త దూరంగా ఉండటం బెటర్ అని ఫీల్ అవుతున్నారు.
తల్లి మనసు
తల్లి మనసు… ఎలాంటి బజ్ లేకుండా, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అవుతున్న మూవీ. అందుకే ఇది చివరి స్థానంలో ఉందని చెప్పొచ్చు. తెలిసిన క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాలో లేకపోవడం మరో పెద్ద మైనస్.
ఈ వారం దాదాపు 5కి పైగా సినిమాలు విడుదల అవుతున్న కూడా ఒక్క సినిమా మీద కూడా సరైన బజ్ లేదు. ఇటువంటి టైం లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాను ప్లాన్ చేసుకొని ఉండి ఉంటే మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉండుండేది.