UNION BANK Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముంబై, యూనియన్ బ్యాంక్ (UNION BANK)లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 20వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 500
యూనియన్ బ్యాంక్ లో పలు రకాలు ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్), అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్): 250 ఉద్యోగాలు
అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) : 250 ఉద్యోగాలు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఎం పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్ల వయస్సు మించరాదు.
జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 30
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 20
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.unionbankofindia.co.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 శాలరీ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: ICSI Recruitment: డీగ్రీ, బీటెక్ పాసైతే చాలు.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.. జీతం రూ.2,50,000
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 500
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 20