OTT Movie : ఓటిటిలోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. కొత్త కొత్త స్టోరీలతో తమ టాలెంట్ చూపించుకుంటున్నారు దర్శకులు. అయితే వీటిలో మలయాళం సినిమాలకు ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ సినిమాలలో మమ్ముట్టి, మోహన్లాల్ పేర్లు తప్ప పెద్దగా ఎవరు పాపులర్ కాలేదు. అయితే ఇప్పుడు మలయాళం సినిమాలో వస్తున్న హీరోలు, విలన్ల పేర్లతో సహా ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటున్నారు. అంతలా ఈ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, బీటెక్ ఫైల్ అయిన ఒక విద్యార్థి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల్ని బాగా అలరించింది. థియేటర్లలో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
ఉమేష్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి బి.టెక్ పరీక్షల్లో 42 సబ్జెక్టులలో ఫెయిల్ అవుతాడు. అతను చదువులో విఫలమైనప్పటికీ, సినిమా దర్శకుడు కావాలని కలలు కంటాడు. తండ్రి ఒక కిరాణా కొట్టును నడుపుతూ ఉంటాడు. ఇక కొడుకు చదువులో వెనకబడటంతో, షాప్ చూసుకోమని తండ్రి ఒత్తిడి చేస్తాడు. ఉమేష్ కి ఆ పని చేయడం ఇష్టం లేక, ఇంటి నుండి పారిపోతాడు. సినిమా రంగంలో అవకాశాలు వెతుక్కోవడానికి చెన్నైకి వెళ్తాడు. ఇలా అతని జీవితం సాగుతుండగా, డైసీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ పరిచేయంలో ఉమేష్ డైసీతో ఒక సెల్ఫీ తీసుకుంటాడు. ఆ సెల్ఫీ అతని జీవితంలో పెను మార్పులకు దారితీస్తుంది. ఈ సెల్ఫీ వల్ల అతని జీవితం ఊహించని విధంగా మారిపోతుంది. ఉమేష్ తన స్నేహితులు జాకీ, షాజీ సహాయంతో ఈ గందరగోళంలో నుండి బయటపడే ప్రయత్నం చేస్తాడు. ఈ స్టోరీ ట్విస్ట్‌లతో, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా మారుతుంది. చివరికి ఆ సెల్ఫీ వల్ల ఉమేష్ కి ఎటువంటి సమస్యలు వస్తాయి ? అతను సినిమా డైరెక్టర్ అవుతాడా ? ఇంటికి వచ్చి కిరాణా కొట్టును చూసుకుంటాడా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఒంటిపై నూలు పోగు లేకుండా కుప్పలుగా శవాలు… బ్లాక్ మ్యాజిక్ తో వణుకు పుట్టించే హర్రర్ థ్రిల్లర్
జియో హాట్ స్టార్ (jio hotstar) లో
ఈ మలయాళ రోడ్ కామెడీ మూవీ పేరు ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ (Oru Vadakkan Selfie). 2015లో విడుదలైన ఈ సీమాకు జి. ప్రజిత్ దర్శకత్వం వహించారు. ఇందులో నివిన్ పౌలీ, మంజిమ మోహన్, అజు వర్గీస్, నీరజ్ మాధవ్ ప్రధాన పాత్రల్లో నటించారు.షాన్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఇది 2015 వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాలలో ఒకటిగా నిలిచింది.ఈ సినిమాను తెలుగులో ‘మేడ మీద అబ్బాయి’ పేరుతో రీమేక్ చేశారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.