Stenographer Jobs: హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ఇది సూపర్ న్యూస్. ఇంటర్ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్, ఉప్పల్ లోని సీఎస్ఐఆర్‌కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్(NGRI) కింద జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష్ రిలీజైంది. ఆసక్తి ఉండి అర్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 04
విద్యార్హత: ఇంటర్ పాసై ఉంటే సరిపోతుంది.
వేతనం: నెలకు రూ.52,100 వేతనం ఉంటుంది.
వయస్సు: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది)
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు గడువు తేది: 2025 జనవరి 31
అఫీషయల్ వెబ్ సైట్: https://www.ngri.res.in/
Also Read: Bureau of Indian Standards Jobs: నెలకు రూ.70,000.. ఈ అర్హతలు వెంటనే అప్లై చేయండి..
అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం పొందండి. ఆల్ ది బెస్ట్.