Geethu Royal: సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. ఆ వచ్చిన ఫేమ్ ఉపయోగించుకోవడానికి పచ్చళ్ల బిజినెస్ మొదలుపెట్టి భారీగా ఆర్జిస్తున్నారు అలేఖ్య సిస్టర్స్. ముఖ్యంగా అలేఖ్య చిట్టి పికెల్స్ పేరిట భారీగా సంపాదించిన వీరు ఇటీవల ఒక కస్టమర్ తో మాట్లాడిన మాటలకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయిన విషయం తెలిసిందే. రాజమండ్రికి చెందిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు అలేఖ్య, సుమా, రమ్య కంచర్ల ..నాన్ వెజ్ , వెజ్ పచ్చళ్ల వ్యాపారంతో బాగా ఫేమస్ అయ్యారు. అయితే కస్టమర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి అని అడిగిన ఒక కష్టమర్ పై అలేఖ్య అసభ్యకరమైన, రాయడానికి వీలు లేని పదాలతో బూతులు తిడుతూ ఆడియో రూపంలో రిప్లై ఇచ్చింది. ఇక ఆ ఆడియో ని సదరు కస్టమర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఒక రేంజ్ లో ట్రోల్స్ చేశారు నెటిజన్స్. అంతేకాదు ఆమె ఇంకా ఎవరిని తిట్టింది అనేది కూడా బయటకు లాగారు. దాంతో అలేఖ్య చిట్టికి సంబంధించి మూడు, నాలుగు ఆడియోలు హల్చల్ చేయడంతో వీరిపై ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయి.
క్షమించమని వేడుకున్నా.. ఆగని ట్రోల్స్..
ఇకపోతే ట్రోల్స్ , మీమ్స్ రావడమే కాదు.. ఆఖరికి పలువురు స్టార్లు కూడా తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ ఆడియోనే ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో దిగివచ్చిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళు.. మొదట ఒకరికి పంపబోయి ఇంకొకరికి పంపామని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. దాంతో క్షమించండి అని వీడియో రిలీజ్ చేసినా ట్రోల్స్ ఆగలేదు. ఆఖరికి ఈ ట్రోల్ దెబ్బకు డిప్రెషన్ కి గురై, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో అలేఖ్య ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మా చెల్లిని ఈ పరిస్థితుల్లో చూడడం చాలా బాధగా ఉంది అని, అలేఖ్య అక్క సుమా ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఇకపోతే వీరిని ఎంతమంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు. వీరికి సపోర్ట్ చేసేవారు కూడా సోషల్ మీడియాలో ఉన్నారు.
Sunny Deol: అందుకే షారుక్ తో 30 ఏళ్ళు మాట్లాడలేదు – సన్నీ దేవోల్..!
అలేఖ్య సిస్టర్స్ కి సపోర్ట్ గా గీతూ రాయల్ వీడియో రిలీజ్..
అలాంటి వారిలో ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ కూడా ఈ సిస్టర్స్ కి సపోర్ట్ చేశాడ ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ కూడా అలేఖ్య చిట్టి సిస్టర్స్ కి సపోర్ట్ చేసింది. ఈ మేరకు ఆమె ఒక వీడియో రిలీజ్ చేస్తూ..” ఈ బూతులనేవి ఏవైతే ఉన్నాయో అది కోపం వచ్చినప్పుడు మగవారే కాదు ఆడవారు కూడా మాట్లాడొచ్చు. కానీ ఎవరితో మాట్లాడుతున్నావ్.. ఎప్పుడు మాట్లాడుతున్నావ్.. మనం మాట్లాడేదానికి ఏదైనా అర్థం ఉందా.. లేదా.. అనేది మాత్రమే గమనించాలి. ముఖ్యంగా అలేఖ్య చిట్టి పికెల్స్ వాళ్ళు వాళ్ళ కస్టమర్ ను ఏదో చిన్న ప్రశ్న అడిగినదానికి అమ్మనా బూతులు తిడితే మెసేజ్ చేశారు. ఇక వీడియో వైరల్ అయ్యేసరికి భయపడి సారీ చెప్పారు. ఇంకెప్పుడూ చేయమని చెప్పారు .తప్పు అనేది అందరూ చేస్తారు. మనిషి స్వభావమే తప్పు చేయడం. ఇక్కడ ట్రోల్స్ చేసేవారు ఎవరూ పతీతులు కాదు. వాళ్ళందరూ పరవాన్నం వండితే తెల్లారే వరకు చల్లారకుండా ఉండదు” అంటూ వీడియో రిలీజ్ చేసింది గీతూ.. ప్రస్తుతం గీతూ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
?utm_source=ig_web_copy_link