BigTV English

Kavitha : ఏపీ పాలిటిక్స్‌లో కవిత కలకలం.. మాటల మంటలు..

Kavitha : ఏపీ పాలిటిక్స్‌లో కవిత కలకలం.. మాటల మంటలు..

Kavitha : ఇటీవలే AI అంటే అనుముల ఇంటెలిజెన్స్ అంటూ కవిత వాక్చాతుర్యం చూపబోయారు. వెంటనే కాంగ్రెస్‌ నుంచి ఖతర్నాక్ కౌంటర్ పడింది. ఏఐ వాడుకునే ఫోన్ ట్యాపింగ్ చేశారని గుర్తు చేశారు. బాహుబలి మూవీలో మాహిష్మతి రాజ్యానికి లేడీ డాన్‌లా మారాలని కవిత కోరుకుంటున్నారంటూ ఎంపీ చామల సెటైర్లు వేశారు. ఈసారి ఏపీ పాలిటిక్స్‌పై కామెంట్ చేశారు. జనసేనాని జోలికి వచ్చారు. అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని.. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. పవర్ స్టార్‌ను టచ్ చేస్తే ఎట్టా ఉంటాదో వెంటనే కవితకు తెలిసొచ్చింది. జనసైనికులు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వీడియోలను ట్వీట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.


బాబు గారు గ్రేట్

అదే ఇంటర్వ్యూలో మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు కవిత. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్‌బాబులను పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు సిన్సియర్ అని, ఎన్నో ఛాలెంజెస్‌ను ధైర్యంగా స్వీకరిస్తుంటారని అన్నారు. నారా లోకేశ్ మెచ్యూర్డ్ లీడర్ అని కొనియాడారు. మంచి పోరాటం చేస్తున్నారంటూ జగన్‌ను సైతం కీర్తించారు కవిత. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకే రానంటూ బెంగళూరు ప్యాలెస్‌కే పరిమితమైన జగన్‌ 2.o లో అంతటి ఫైటర్ ఎలా కనిపించారంటూ టీడీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. ఇలా ఏపీ లీడర్లు అందరినీ పొగిడి.. ఒక్క పవన్‌ను మాత్రం.. ఎందుకలా?


జనసేనతో పెట్టుకుంటే..

పవన్ కల్యాణ్‌ను కవిత తక్కువ చేసి మాట్లాడటం.. చంద్రబాబు, లోకేశ్‌లను ప్రశంసించడాన్ని ఎలా చూడాలి? ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్ ఎంత గోల చేస్తున్నా.. సినిమాలను పక్కనపెట్టి ఫుల్ టైమ్ పాలన మీదే ఫోకస్ పెట్టారు జనసేనాని. ప్రజల కోసం భార్యాపిల్లలకు కూడా దూరంగా ఉంటున్నారు. రోజంతా సమీక్షల్లో మునిగితేలుతున్నారు. ఇంత చేస్తుంటే.. ఇంకా ఆయన్ను సీరియస్ పొలిటీషియన్ కాదంటూ కవిత అనడం కరెక్టేనా? ఆమె అసలు ఏపీ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారా, లేదా? అనే డౌట్ వస్తోందని అభిమానులు అంటున్నారు. ఓవైపు కేటీఆర్ మాత్రం పవన్‌తో క్లోజ్ రిలేషన్ మెయింటెన్ చేస్తుంటారు. చంద్రబాబుకు దూరంగా ఉంటారు. అన్న అలా ఉంటే.. చెల్లి మాత్రం పవన్‌పై నోరు పారేసుకోవడం జనసైనికులను కవ్వించే పనే అని విశ్లేషకులు చెబుతున్నారు.

కవిత మాటల వెనుక వ్యూహం?

కవిత కావాలనే అలా మాట్లాడుతున్నారా? తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్లు, మహాత్మ ఫూలే విగ్రహ ఏర్పాటు అంటూ ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌తో బిజీగా ఉంటున్నారు. బీఆర్ఎస్ నుంచి అంతగా సపోర్ట్ లేకున్నా.. సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కావలసినంత కవరేజ్ రావట్లేదని అనుకుంటున్నట్టున్నారు. అందుకే, తన ఉనికిని బలంగా చాటుకునేలా.. మంచో, చెడో తన గురించి జనాలు మాట్లాడుకునేలా.. వరుస ధర్నాలు, ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లతో కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తనను మర్చిపోకుండా.. తానున్నానని గుర్తించేలా.. కావాలనే కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారనే అనుమానమూ లేకపోలేదు. బాగా మాట్లాడుతారనే పేరు గతంలో కవితకు ఉండేది. విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పే అలవాటు ఉంది. అలాంటిది పవన్ కల్యాణ్‌పై అంతటి మాట ఏదో యధాలాపంగా అనేసి ఉంటారని అనుకోలేమని అంటున్నారు. కవిత మాటల వెనుక ఏదో మతలబే ఉండి ఉంటుందని డౌట్. సోషల్ మీడియాలో తన చుట్టూ రచ్చ జరగాలనే.. కావాలనే అలా అన్నారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×