TET Exam Schedule: టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఇది బిగ్ అలెర్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్- 2025) ఫస్ట్ విడత నోటిఫికేషన్ ను విద్యా శాఖ ఏప్రిల్ 11 న జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే మొదటి విడతకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇప్పటికే విడుదల చేయగా.. నేటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది.
జూన్ నెలలో ఆన్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని టెట్ చైర్మన్, పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు ఈవీ నరసింహా రెడ్డి తెలిపారు. ఎస్‌జీటీ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే పేపర్-1, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే పేపర్ -2 ఎగ్జామ్ ఉంటుంది. మళ్లీ పేపర్ -2 లో రెండు వేరు వేరు పేపర్లు (మ్యాథ్స్- సైన్స్ ఒక్క పేపర్ గా, సోషల్ ఒక్క పేపర్ గా) ఉంటాయి. అయితే ఈ పేపర్ కు దరఖాస్తు ఫీజును రూ.750 గా నిర్ణయించారు. రెండు పేపర్లకు అయితే రూ.1000 గా దరఖాస్తు ఫీజును నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజు: ఒక్క పేపర్ కు అయితే రూ.750 ఉంటుంది. రెండు పేపర్లకు రూ.1000 ఫీజు ఉంటుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
టెట్ ఎగ్జామ్ కు రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మందికి పైగా పోటీపడనున్నారు. గతంలో జరిగిన టెట్ పరీక్షలకు మొత్తం 2 లక్షల 75 వేల 753 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,05,278 మంది మాత్రమే పరీక్షలు రాశారు. వారిలో 83,711 మంది మినిమమ్ మార్కులు సాధించి డీఎస్సీ పరీక్షలకు ఎలిజిబిలిటీ సాధించారు.
టెట్ ఎగ్జామ్ ఎన్ని మార్కులు- ఎన్ని వస్తే ఉత్తీర్ణులు..
టెట్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉండనున్న విషయం తెలిసిందే. పేపర్ 1 (1 నుంచి 5 తరగతుల వరకు బోధించే అభ్యర్థులకు), అలాగే పేపర్ 2 (6 నుంచి 8 తరగతుల వరకు బోధించే అభ్యర్థులకు) ప్రతి పేపర్ 150 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఎగ్జామ్ టైం 2 గంటల 30 నిమిషాలు (2.30 గంటలు) ఉంటుంది. TS TET (తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఎగ్జామ్ లో.. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 90 మార్కులు సాధిస్తే అర్హత సాధించినట్లు అవుతారు. బీసీ అభ్యర్థులు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించే డీఎస్‌సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
ఓసీలు – 90 మార్కులు
బీసీలు – 75 మార్కులు
ఎస్సీ, ఎస్టీలు – 60 మార్కులు
TET షెడ్యూల్..
నోటిఫికేషన్ వచ్చిన తేది: ఏప్రిల్ 11
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే తేదీలు: ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు
హాల్ టిక్కెట్ల డౌన్ లోడ్: జూన్ 9 నుంచి చేసుకోవచ్చు
ఆన్ లైన్ ఎగ్జామ్ డేట్స్: జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య జరగనున్నాయి.
ఎగ్జామ్ టైం: పొద్దున 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు (రోజుకు రెండు విడతలుగా ఎగ్జామ్ లు నిర్వహిస్తారు.)
రిజల్ట్స్ డేట్: జూలై 22
Also Read: EdCIL India Limited: సొంత రాష్ట్రంలో 103 ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.. జీతం రూ.30,000
Also Read: NMDC Recruitment: ఒక్క ఇంటర్వ్యూతోనే కొలువు, ఈ అర్హతలు ఉంటే చాలు, ఇదిగో పూర్తి వివరాలు..