E-Paper
Advertisement

TG Ed.CET 2026: తెలంగాణ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

TG Ed.CET 2026: తెలంగాణ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
Advertisement

తెలంగాణలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష కీలకం కానుంది.

విద్యార్హత.. 

Advertisement

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ డిగ్రీ సబ్జెక్టుల ఆధారంగానే ఎడ్‌సెట్‌లో మెథడాలజీని ఎంచుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ, ఫీజు వివరాలు.. 

Advertisement

దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23న ప్రారంభమై ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. సాధారణ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 750 కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 550 గా నిర్ణయించారు.

పరీక్ష విధానం..

ఈ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులకు గాను 150 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థుల సౌకర్యార్థం ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్-తెలుగు లేదా ఇంగ్లిష్-ఉర్దూ మాధ్యమాల్లో రూపొందిస్తారు.

ఆలస్య ఫీజుతో.. 

నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు ఆలస్య రుసుముతో మే 9 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. రూ. 250 నుండి రూ. 5000 వరకు వివిధ శ్లాబుల్లో ఫైన్ చెల్లించి దరఖాస్తును సమర్పించవచ్చు.

ఎడిట్ ఆప్షన్

దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి మే 2న ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. మే 9 నుండి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 12న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుంది.

మే 30న ఫైనల్ రిజల్ట్

పరీక్ష ముగిసిన మూడు రోజుల్లోనే అంటే మే 15న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం మే 30న తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి.

అఫీషియల్ వెబ్ సైట్: https://edcet.tgche.ac.in

ALSO READ: DMHO Jobs: ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం భయ్యా.. ఆ జిల్లాలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ, పూర్తి వివరాలు ఇదిగో..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×